Technology

ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్‌ ఉందా.. అయితే ఇది తెలుసుకోండి!

ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండడం సర్వ సాధారణం. ఇన్నాళ్లు చదువుకున్న వాళ్ళు, వ్యాపార కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు, కొద్దో గొప్పో డబ్బులు దాచుకోవాలనుకునే వారికీ మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల పుణ్యమా అని ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలుంటున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులను విలీనం చేయడంతో బ్యాంకులలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ బ్యాంకులు ఇక కనపడవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బ్యాంకులకి సంబంధించిన పాస్ బుక్స్, చెక్ బుక్స్ మార్చి 31 వరకు మాత్రమే పని చేస్తాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్తవి అమలులోకి రానున్నాయి. సిండికేట్, కెనెరా బ్యాంక్ పాస్‌బుక్, చెక్ బుక్స్ 2021 జూన్ 30 వరకు పనిచేస్తాయి. వీటికి సంబంధించిన వివరాలను తదితర బ్యాంకులు ఆయా కస్టమర్లకు ఈ మెయిల్స్, మెసేజెస్ ద్వారా తెలియ చేయడం జరుగుతూనే ఉంది.

కొత్త అకౌంట్ నెంబర్ తీసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, అడ్రస్, నామినీ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. అకౌంట్ సంబంధించిన చార్జీలు ఎలా ఉంటాయో బ్యాంకులనే సంప్రదించాలి. కొత్త పాస్ బుక్ వచ్చిన తరువాత అకౌంట్ ని అప్ డేట్ చేయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పీఎఫ్ అకౌంట్‌లో అకౌంట్ నెంబర్ మార్చాలి.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM