ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండడం సర్వ సాధారణం. ఇన్నాళ్లు చదువుకున్న వాళ్ళు, వ్యాపార కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు, కొద్దో గొప్పో డబ్బులు దాచుకోవాలనుకునే వారికీ మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాల పుణ్యమా అని ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలుంటున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకులను విలీనం చేయడంతో బ్యాంకులలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ బ్యాంకులు ఇక కనపడవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బ్యాంకులకి సంబంధించిన పాస్ బుక్స్, చెక్ బుక్స్ మార్చి 31 వరకు మాత్రమే పని చేస్తాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్తవి అమలులోకి రానున్నాయి. సిండికేట్, కెనెరా బ్యాంక్ పాస్‌బుక్, చెక్ బుక్స్ 2021 జూన్ 30 వరకు పనిచేస్తాయి. వీటికి సంబంధించిన వివరాలను తదితర బ్యాంకులు ఆయా కస్టమర్లకు ఈ మెయిల్స్, మెసేజెస్ ద్వారా తెలియ చేయడం జరుగుతూనే ఉంది.
కొత్త అకౌంట్ నెంబర్ తీసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, అడ్రస్, నామినీ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. అకౌంట్ సంబంధించిన చార్జీలు ఎలా ఉంటాయో బ్యాంకులనే సంప్రదించాలి. కొత్త పాస్ బుక్ వచ్చిన తరువాత అకౌంట్ ని అప్ డేట్ చేయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పీఎఫ్ అకౌంట్‌లో అకౌంట్ నెంబర్ మార్చాలి.