Categories: CinemaLatestTopStory

మా పిల్లలకి ఉదాహరణగా చూపిస్తాను: యంగ్ టైగర్ ఎన్టీఆర్

మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లవారితే గురువారం’. ‘మత్తు వదలరా’ చిత్రంతో గుర్తింపును తెచ్చుకున్న యువ నటుడు శ్రీ సింహా కోడూరి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి 27 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 21 న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఎడిటర్ సత్య మాట్లాడుతూ.. ‘సినిమా నిడివి రెండు గంటలే. చిత్రాన్ని పరిగెత్తించాం. థియేటర్లో ప్రేక్షకులు నవ్వి నవ్వి కింద పడిపోతారు’ అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు మణికాంత్ మాట్లాడుతూ.. ‘మార్చి 27న తెల్లవారితే గురువారం మూవీ రాబోతోంది. యూత్ అయితే అరవింద సమేతతో వెళ్లండి. ఫ్యామిలీ అయితే సకుటుంబ సమేతంగా రండి. సినిమాను చూస్తే అదుర్స్ అనిపించేలా చేస్తాం. నా మొదటి సినిమాకు తారక్ అన్న గెస్ట్‌లా రావడం కలలా ఉంది. నేను దేవుడిని బాగా నమ్ముతాను. అందులో ఒకరు సింహాచలంలో ఉంటే.. ఇంకొకరు కేరళ శబరిమలైలో ఉన్నారు. కానీ నేను అభిమానించే హీరో ఆంధ్రాలో సింహాద్రిలా, కేరళలో సింగమలైలా ఉంటారు. తెల్లవారితే గురువారం అనే సినిమాకు వస్తే.. ఉదయం 4 40 నిమిషాలకు వరుడు వీరేంద్ర పెళ్లి. కానీ ఎవరో తెలీదు’ అని చెప్పుకొచ్చారు.

కీరవాణి మాట్లాడుతూ.. ‘ఇది మా అబ్బాయి రెండో సినిమా. మొదటి సినిమా అయినా రెండో సినిమా అయినా మూడో సినిమా అయినా కూడా దర్శకులు చెప్పింది విని స్టూడెంట్స్‌లా ఎంతో నేర్చుకోవాలి.. అందుకే స్టూడెంట్ నెంబర్ వన్ అయిన ఎన్టీఆర్ ఆశీర్వదించేందుకు వచ్చారు. సినిమాకు మంచి రిపోర్ట్ వస్తే.. సాయి గారు మీ ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వస్తాను. మంచి ఒగ్గాణి తినిపించాలి. సింహా, భైరవ ఆల్ ది బెస్ట్. ఫాదర్స్ రెండు రకాలుగా ఉంటారు. గూగుల్ మ్యాప్ ఫాదర్… ఇంట్లోంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్రతీ ఒక్కటి చెబుతుంటారు. కానీ రెండో రకం మాత్రం.. కేవలం ఆల్ ది బెస్ట్.. కమ్ బ్యాక్ సేఫ్ అని చెబుతారు. నేనూ అదే చెబుతాను. కెరీర్ ‌ ప్రారంభించినప్పుడే సింహా, భైరవకు అన్నీ చెప్పాను. ఈ సినిమా కథ కూడా నాకు తెలీదు.. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. అయితే ఇంట్లో వాళ్లు ఏ కొంచెం చేసినా కూడా బాగుందని మాకు అనిపిస్తుంది. కానీ అసలు విషయం మీరు చెప్పాలి. సినిమా ఎలా ఉందనే విషయం మీరు శుక్రవారం చెప్పాలి. భైరవ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వాడు క్లాస్ మాస్ అయినా ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇక మా చిన్నోడి గురించి మీరు చెప్పాలి.. ట్రైలర్, టీజర్ చూస్తేనే సినిమా చాలా రిచ్‌గా ఉందని తెలుస్తోంది. నిర్మాతలు అద్భుతంగా నిర్మించారు. మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీశాడు’ అని అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను. మీరు (అభిమానులు) అరిస్తే ఎనర్జీ వస్తుంది. ఇలా చాలా తక్కువ సార్లు ఇబ్బంది పడుతుంటాను.. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను. రేపొద్దున భార్గవ్, అభయ్‌ను చూసి కూడా ఎంతో సంబరపడతానేమో. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడు ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి.. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దోహదపడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి.. పిల్లలను ఎలా మంచిగా పెంచాలని ప్రణీత, నేను రోజూ అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరూ (సింహా, భైరవ) ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతీ కొడుకు సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది.. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకోవడానికి వీళ్లున్నారు. సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అని అన్నారు.

Recent Posts

ఇంద్రకీలాద్రిపై ‘దేవీం స్మరామి’.. భాగ్యనగరంలో ‘దుర్గే ప్రసీద’తో ఆకట్టుకున్న పురాణపండ

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…

October 11, 2024 at 1:09 PM

దేవీచౌక్ అమ్మవారి ఉత్సవాల్లో మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…

October 6, 2024 at 8:21 PM

‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముఖ్యాంశాలు

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌,…

October 5, 2024 at 12:58 PM

రికార్డులు బద్ధలు కొడుతున్న ‘డీమాంటే కాలనీ 2’

నేషనల్‌, అక్టోబర్‌xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో…

October 5, 2024 at 12:29 PM

గోపీచంద్ ‘విశ్వం’ థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…

October 5, 2024 at 12:19 PM

ఆలియాభట్‌ “ఆల్ఫా” వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…

October 5, 2024 at 12:11 PM