Latest

దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏపీ చరిత్రలోనే..

AP CM Jagan Mohan Reddy Press Meet: భారతదేశంలో ఎక్కడా లేని విధంగా.. పెద్ద సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేశామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా విద్య వైద్య రంగాల్లో నాడు–నేడుతో సమూల మార్పులు చేశామన్నారు. బుధవారం నాడు తాడేపల్లిగూడెంలోని క్యాంపు‌ కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 30.92 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలో.. బహుషా దేశ చరిత్రలో కూడా ఏనాడూ ఒక 5 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరిగి ఉండకపోవచ్చనన్నారు. కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే పంపిణీ చేయడమే కాకుండా.. హౌజింగ్‌ రంగంలోనే ఒక కొత్త నిర్వచనానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) పథకాన్ని బహుషా మన రాష్ట్రం మాత్రమే సమర్థవంతంగా వినియోగించుకుంటుందని చెప్పవచ్చనుకుంటానని అధికారులతో సీఎం చెప్పారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఇళ్ల స్థలాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని.. ఆ విధంగా ప్రతి ఒక్క చర్య గతంలో ఏనాడూ లేని విధంగా ఉన్నాయని.. ఇవన్నీ ఒక విప్లవాత్మక నిర్ణయాలు, కార్యాచరణ అని అధికారులతో జగన్ అన్నారు.

ఇదో మహత్తర పని
నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచనలు చేయడమే ఒక మహత్తర పని. ఎందుకంటే ఏనాడూ, ఎక్కడా అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో కేవలం 20 నెలల వ్యవధిలోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. అది ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. అది మన ప్రభుత్వ అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో ఆలోచించి, కచ్చితంగా ఏదైనా చేయాలని గట్టిగా సంకల్పించి, ఆ పని చేసి చూపించింది అని జగన్ తెలిపారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM