Politics

దేవుడికి కృతజ్ఞతలు.. సంతోషంగా ఉంది : జగన్

AP CM YS Jagan Press Meet: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నాడు తాడేపల్లిగూడెంలోని క్యాంపు‌ కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గత 20 నెలలుగా మీ అందరితో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పలు విషయాలను జగన్ పంచుకున్నారు. ‘ఒక నానుడి ఉంది. క్రికెట్‌లో కెప్టెన్‌ ఒక్కడి వల్లనే గెలుపు సాధ్యం కాదు. మొత్తం టీమ్‌ కలిసి సమష్టిగా కృషి చేస్తేనే ఏదైనా విజయం సాధ్యం అని.. మీ వంటి టీమ్‌ ఇక్కడ ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు, సమర్థులు. అందరూ సమష్టిగా కృషి చేసినందువల్లనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాము. దిశ చట్టం మొదలు.. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో ఆ చట్టం ఒక విప్లవాత్మక పరిణామమని చెప్పవచ్చు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాలో ఇంకా ఎన్నో ఉన్నాయి’ అని అధికారులతో జగన్ అన్నారు. జగన్ చెప్పిన ఈ మాటలతో అధికారులు కొందరు భావోద్వేగానికి గురయ్యారు.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM