వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం (డిసెంబర్ 15),లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసింది.
‘సతీ లీలావతి’ చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జయిటింగ్ కథాంశంతో మెప్పించటానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.
మిక్కీ జె.మేయర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా.. కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
‘పుష్ప-2’ ది రూల్ వైల్డ్ ఫైర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో ఐకాన్‌స్టార్ సరికొత్త చరిత్ర ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు…
క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్…
హీరో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్…
కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్…
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్…
సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజాUI ది మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి…