Cinema

బచ్చల మల్లి ట్రైలర్ అదిరిపోయింది: నేచురల్ స్టార్ నాని

హీరో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్‌ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ రస్టిక్ యాక్షన్‌ డ్రామా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్‌, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు నేచురల్ స్టార్ నాని ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
బచ్చల మల్లి (అల్లరి నరేష్) వర్షంలో అపస్మారక స్థితిలో పడివున్న సీన్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఓపెన్ అయ్యింది. రావు రమేష్ పోషించిన పోలీసు అధికారి పాత్ర బచ్చల మల్లి నిర్లక్ష్య ప్రవర్తనను హైలైట్ చేసే కీలకమైన సంఘటనలను వివరిస్తాడు – ఒకటి సత్యవరం జాతరలో జనంతో అతని హింసాత్మక ఘర్షణ, మరొకటి అతను వేశ్య కోసం పోలీసులపై దాడి చేయడం. అతని ఫెరోషియస్ గతం ఉన్నప్పటికీ, ఒక అమ్మాయి అతని జీవితంలోకి ప్రవేశించడంతో మార్పుకు దారితీస్తుంది. అయితే వీరి బంధాన్ని ఆమె తండ్రి వ్యతిరేకిస్తున్నాడు. ఏదో త్రెట్ చూడటంతో ట్రైలర్ ఎక్సయిటింగ్ ముగుస్తుంది, ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.
అల్లరి నరేష్ బోల్డ్, రగ్గడ్ మొండి పట్టుదలగల పాత్రలో ఆరదగొట్టారు. ఈ పాత్ర కోసం పూర్తి మేకోవర్ అయ్యారు. పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అమృత అయ్యర్ ప్రేమికురాలిగా అద్భుతంగా కనిపించింది. ఈ ట్రైలర్‌లో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్ , వైవా హర్షతో సహా ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు.
సుబ్బు మంగాదేవి ఇంటెన్స్ కథను తీసుకుని, గొప్ప ఎంగేజ్‌మెంట్‌తో ప్రజెంట్ చేశారు. కథనం ప్రారంభం నుండి ముగింపు వరకు కట్టిపడేస్తుంది. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ బీజీఏం అద్భుతంగా వున్నాయి. హాస్య మూవీస్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్ గా వుంది. సుబ్బు మంగదేవి కథ, సంభాషణలు రాశారు, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లేను నిర్వహించగా, అదనపు స్క్రీన్‌ప్లేకి విశ్వనేత్ర సహకారం అందించారు. టీజర్ భారీ అంచనాలను సృష్టించగా, ట్రైలర్ ఆ అంచనాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా టీజర్ చూసి నరేష్ కి ఫోన్ చేశాను. ఈ సినిమా కోసం ఏదైనా చేయాలనే ఉందని చెప్పాను. సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయింది, అది బ్లాక్ బస్టరా, ఏ రేంజ్ అనేది టైం డిసైడ్ చేస్తుందని చెప్పాను. నాకు నేనుగా ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ అదిరిపోయాయి. నరేష్ హిట్ కొడతాడనే నమ్మకం ఆడియన్స్ లో కూడా వచ్చేసింది. సుబ్బు నా ఫేవరెట్ అసిస్టెంట్ డైరెక్టర్. మజ్ను సినిమా చేస్తున్నప్పుడు తను నా వన్ మేన్ ఆర్మీ. ఏ అవసరం ఉన్నా తననే అడిగేవాణ్ణి. ఆ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ తనది కూడా. అప్పుడే తను డైరెక్ట్ అయిపోతాడని చెప్పాను. తన జర్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. బచ్చలమల్లి చూసినప్పుడు సుబ్బు కి తన బలం దొరికిందని అనిపించింది. సుబ్బు బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి బెస్ట్ విషెస్. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ నా ఫేవరెట్. కృష్ణగాడి వీరప్రేమగాధ నా ఫేవరెట్ ఫిలిం. దానికి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు . ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా డెప్త్ ఉంది .సుబ్బు ట్రైలర్ లోనే కథ చెప్పాలనుకున్నాడు అంటే సినిమాలో ఇంకెంత హానెస్ట్ గా ప్రయత్నించి ఉంటాడో నేను ఊహించగలను. అమృత ఆల్ ది వెరీ బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ క్రిస్మస్ మనదే. ఈ డిసెంబర్లో పుష్ప2 ఫుల్ మీల్స్ పెట్టేసింది.ఈ డిసెంబర్ ని బచ్చలమల్లి సక్సెస్ తో మంచి డెసర్ట్ గా ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ… థాంక్యూ నాని. తనకి థాంక్యూ చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. తను నాకు ఫ్యామిలీ. 16 ఇయర్స్ నుంచి మా జర్నీ కొనసాగుతుంది. లో టైం లో ఉన్నప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే. రోషన్, అంకిత్, జయరాం గారు, ప్రవీణ్ యాక్టర్స్ అందరూ చాలా ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు. సుబ్బు ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పారో అంతే అద్భుతంగా ఈ సినిమాని తీశారు. మా టెక్నీషియన్స్ అందరికీ థాంక్యూ. విశాల్ చంద్రశేఖర్ గారు చాలా కొత్త సౌండ్ ఇచ్చారు. సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. నాకు ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు ఆల్రెడీ హిట్ కొట్టేసాం అనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ’ అన్నారు
హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ… నాని గారికి థాంక్యూ సో మచ్. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన అందరూ 100% ఇచ్చారు. నాకు కావేరి లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన సుబ్బు గారికి థాంక్యూ. నరేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. బచ్చల మల్లి క్యారెక్టర్ ని ఆడియన్స్ లవ్ చేస్తారు. ఈ సినిమాని ఆడియన్స్ గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను థాంక్యూ.’ అన్నారు
డైరెక్టర్ సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ… ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన నాని గారికి థాంక్యూ. నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మజ్ను సినిమా టైం నుంచి నాకు తెలుసు. నేను సోలో బ్రతుకు కథ ఆయనకి చెప్పాను. ఆయన చాలా అద్భుతమైన ఇన్పుట్ ఇచ్చారు. నాని గారిని అందరూ నేచురల్ స్టార్ అంటారు కానీ ఆయన నేచర్ స్టార్. సీజన్ కి తగ్గ కంటెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తుంటారు. ఆయన ఈ ఆయన ఈవెంట్ కి రావడమే ఒక బ్లాక్ బస్టర్ కొట్టేసాననే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం నరేష్ గారు. నేను రాసిన దాన్ని ఆయన అర్థం చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం వల్లే ఇంత గ్రాండ్ గా వచ్చింది. నేను ఎం చెప్పినా చేశారు. ఆ నమ్మకం తప్పకుండా గెలుస్తుంది. అమృత కావేరి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఆ పాత్రని అందరూ ప్రేమిస్తారు. హాస్య మూవీ ప్రొడక్షన్ టీం అందరికీ థాంక్యూ’ అన్నారు
నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈరోజు మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన నేచురల్ స్టార్ నాని గారికి థాంక్యూ. డిసెంబర్ 20. ఈ క్రిస్మస్ కి బచ్చలమల్లి మోత మోగిపోద్ది. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. థాంక్యూ’అన్నారు
డైరెక్టర్ యోగి మాట్లాడుతూ… నరేష్ గారు వెరీ ఇంటెన్స్ యాక్టర్. ఇలాంటి ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఫుల్ లెన్త్ చూడడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈవెంట్ కి వచ్చిన నాని గారికి థాంక్యూ. డైరెక్టర్ సుబ్బు చాలా అద్భుతంగా తీశాడు. ఇలాంటి మంచి సినిమాని నిర్మించిన రాజేష్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’ అన్నారు
యాక్టర్ అంకిత్ మాట్లాడుతూ… ఇందులో చాలా ఇంటెన్స్ రోల్ ప్లే చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. బచ్చల మల్లి క్యారెక్టర్తో నడిచే కథ . ఇలాంటి కథలు తీయడం చాలా కష్టం. సెల్ఫ్ రియలైజేషన్ కాన్సెప్ట్ ని తీసుకుని చాలా అద్భుతంగా ఈ సినిమాని చేయడం జరిగింది. డిసెంబర్ 20న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రిస్మస్ మనదే’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.

Recent Posts

బాలీవుడ్ హిస్టరీ… ఐకాన్ స్టార్ తిరగరాసాడు

‘పుష్ప-2’ ది రూల్‌ వైల్డ్‌ ఫైర్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో ఐకాన్‌స్టార్‌ సరికొత్త చరిత్ర ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు…

December 20, 2024 at 9:53 PM

అనుష్క శెట్టి ఘాటీ చిత్రం విడుదల తేదీ పరిష్కరించబడింది

క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్…

December 15, 2024 at 6:17 PM

లావ‌ణ్య త్రిపాఠి సతీ లీలావతికి దర్శకుడు తాతినేని సత్య

వైవిధ్య‌మైన ప్రాత‌ల‌తోక‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్క‌నున్న సినిమా…

December 15, 2024 at 6:10 PM

‘డాకు మహారాజ్’.. మొదటి గీతం విడుదల

కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్…

December 15, 2024 at 6:00 PM

‘గేమ్ చేంజర్’ లో అప్పన్న పాత్రను చూస్తే షాక్ అవుతారు: నటుడు శ్రీకాంత్

సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్…

December 15, 2024 at 5:53 PM

‘UI’ సినిమా కోసం సెపరేట్ వరల్డ్ బిల్డ్ చేశాం: సూపర్ స్టార్ ఉపేంద్ర

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజాUI ది మూవీతో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి…

December 15, 2024 at 4:51 PM