Cinema

Sarkaru Vaari Paata: సూప‌ర్‌స్టార్ ‘స‌ర్కారు వారి పాట’ షూటింగ్ స్టార్ట్స్

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ‘స‌ర్కారు వారి పాట’ షూటింగ్ సోమవారం దుబాయ్‌లో మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘స‌ర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ తొలిసారి మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ సోమవారం దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేస్తూ ‘ది ఆక్ష‌న్ అండ్ ది యాక్ష‌న్ బిగిన్స్’ అంటూ ఒక వీడియోని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ.. ‘స‌ర్కారు వారి పాట’మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుగారిని డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబుగారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం.. అన్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఎస్.ఎస్ మాట్లాడుతూ.. స‌ర్కారు వారి పాట రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ – లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట; రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM