Man Shocked with Camera at Train wash Room
ప్రతి నిత్యం ఎందరో రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. వాటిల్లో ఉండే సదుపాయాల గురించి అందరికి తెలిసిందే. వేరే స్టేట్స్ రైల్వేలలో ఉండే సదుపాయాల గురించి కంటే మన భారతీయ రైల్వేలలో ఉండే సదుపాయాల చాలా తక్కువ. రైళ్లలో దొరికే ఫుడ్ విషయం పక్కన పెడితే, మరుగుదొడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. దూర ప్రాంతాలకి వెళ్లేవారు తప్పక ఆ మరుగుదొడ్లని వాడుతుంటారు. కొన్ని కొన్ని రైళ్ల పరిస్థితి బాగానే ఉన్నా, కొన్ని రైళ్లలో ఇలానే ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ముంబై నుంచి భగత్ కి కోఠికి రైల్లో ప్రయాణించాడు. మార్గ మధ్యలో తప్పనిసరి పరిస్థితిలో వాష్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడే ఉన్న డస్ట్ బిన్ కింద ఉన్న దానిని చూసి ఆశ్చర్యపోయాడు. తీరా ఏమిటా అని చూస్తే అక్కడొక పవర్ బ్యాంకు, దానికి ఉన్న ఓ చిన్న కెమెరా. వెంటనే దానిని తీసుకుని రైల్వే పోసులకి సమాచారం అందించాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అదే రైల్లో స్వీపర్ పని చేస్తున్న షేక్ జహిద్దీన్ అనే వ్యక్తి నిర్వాకమని తెలిసి అందరు షాక్ తిన్నారు. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అసలు ఇదంతా ఎన్ని రోజులుగా జరుగుతుంది… ఇప్పటి వరకు ఉన్న డేటా ఎక్కడైనా దాచాడా అనేదానిపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు.
ఇలాంటివి తరుచూ జరుగుతూనే ఉన్నాయి. హోటల్స్‌లో, షాపింగ్ మాల్స్ వంటి చోట కూడా ఇలాంటివి వింటూనే ఉన్నాం. ఇక ట్రైయిన్స్ లో కూడా అంటే.. మానవజాతి ఎంత నీచంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి.. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా.. మరీ ముఖ్యంగా.. ఇలాంటి సందర్భాల్లో కాస్త చుట్టు పక్కల ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. టెక్నాలజీ పెరుగుతుంది అంటే.. సంతోషించాలో.. బాధపడాలో అనే సందిగ్థ పరిస్థితిని ఇలాంటి సంఘటను కలుగుజేస్తున్నాయి.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…