nalgonda mellacheruvu lord shiva temple Greatness
మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివ క్షేత్రం భక్తులతో కిట కిటలాడింది. గత కొంత కాలంగా అన్ని దేవాలయాలు వాటి శోభను కోల్పోయి వెలవెల బోయాయి. ఇలా భక్తులతో దేవాలయాలు కళ కళ లాడుతుండడం చూస్తుంటే మరలా ఆ వైభవం వచ్చిందా అనిపిస్తుంది. కాగా నల్లగొండ జిల్లాలో కృష్ణానది తీరాన వెలసిన శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వామి వారి శిరో భాగం ఎప్పుడు నీరు కారుతూ ఉండడమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో గల శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ శంభు లింగేశ్వర స్వామి ఆలయం మేళ్లచెరువు మండలంలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవులు నిర్మించారు. అక్కడి ప్రజలు ఈ ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యతను గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు.
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుండేవారని, వారి బాధలు చూడలేక ఆ పరమ శివుడే స్వయంగా వారి బాధలు తీర్చడం కోసం ఈ మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిసినట్లు చెబుతుంటారు. అలా వెలసిన శివుడికి ఆవుల మందలోని ఒక ఆవు నిత్యం తన పొదుగు నుండి పాలను వదిలేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక యాదవ రాజు అది గమనించి… ఆ శివ లింగాన్ని గొడ్డలితో 11 ముక్కలుగా నరికి వాటిని 11 ప్రదేశాలలో విసిరేశాడట. కానీ మరలా ఆ శివలింగం యధావిధిగా ఉండేదట.
ఇదిలా ఉండగా ఒక రోజు గంగబోయిన మల్లన్న అనే యాదవ రాజుకు స్వామి కలలోకొచ్చి, ఈ ప్రాంతం రానున్న కాలంలో దక్షిణ కాశీగా పేరు పొందుతుందని చెప్పడంతో… ఆయన వెంటనే ఈ ఆలయాన్ని నిర్మించారట. అప్పటి నుండి ఆ శివలింగం పెరుగుతూ ఉంటుందట. ఈ లింగం పై భాగంలో గంగమ్మ ఉందని.. ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎంత తీసినా ఆ నీరు అలా ఊరుతూనే ఉంటుందట. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వస్తు ఉంటారు. మార్చి 11, శివరాత్రి కావున ఈ ఆలయం భక్తులతో కళ కళలాడింది.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…