గాలి సంపత్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన నాని | Natural Star Nani Released Gaali Sampath Song
Nani Gaali Sampath Song: అతి తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా మారిన అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ చిత్రానికి మరింత క్రేజ్ రావడానికి కారణం స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా స్వయంగా చూసుకోవడమే. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన అనిల్ రావిపూడి కో డైరెక్షన్ లో ఈ చిత్రం మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ `గాలి సంపత్`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ `ఫిఫిఫీ…ఫిఫీ..ఫి…. క్రేజిడాడీ సాంగ్‌ని నేచురల్ స్టార్ నాని
చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – ఇద్దరు అద్భుతమైన నటులు రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీవిష్ణు కలిసి నటించిన గాలి సంపత్ చిత్రంలోని సాంగ్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ – మా మూవీలోని ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన నాని గారికి హృదయపూర్వక దన్యవాదాలు. గాలి సంపత్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి మార్చి11న మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.
`ఫిఫిఫీ…ఫిఫీ..ఫి,
రాజా రాజశ్రీ గాలిసంపత్ గారు మైడియర్ డాడీ బాబండీ.. మా బాబుగారు చేసే డైలీ విన్యాసాలు ఊహాతీతం సుమండీ..అంటూ సాగే ఈ పాటకి స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు అచ్చురాజమణి మంచి స్వరాలు సమకూర్చారు. డా. రాజేంద్రప్రసాద్, రాహుల్ నంబియార్, శ్రీ కృష్ణ విష్ణుబొట్ల కలిసి పాడారు. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి,
కథ: ఎస్. క్రిష్ణ,
రచనా సహకారం: ఆదినారాయణ,
సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్,
సంగీతం: అచ్చురాజమణి,
ఆర్ట్: ఎ ఎస్ ప్రకాశ్,
ఎడిటర్: తమ్మిరాజు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగమోహన్ బాబు. ఎమ్,
మాటలు: మిర్చికిరణ్,
లిరిక్స్: రామజోగయ్య శాస్ర్తి,
ఫైట్స్: నభ,
కొరియోగ్రఫి: శేఖర్, భాను,
మేకప్: రంజిత్,
క్యాస్ట్యూమ్స్: వాసు,
చీఫ్ కో డైరెక్టర్: సత్యం బెల్లంకొండ.
నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్,
నిర్మాత: ఎస్. క్రిష్ణ,
స్క్రీన్ ప్లే, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి,
దర్శకత్వం: అనీష్.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…