Cinema

శిష్యుడిపై ఉప్పెనంత ప్రేమ చూపిన సుక్కు

Sukumar Unconditional Love: గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడు ప్రయోజకుడైతే ఆ గురువు ఆనందమే వేరు.. వీడు నా శిష్యుడు అంటూ గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సుకుమార్ అదే ఆనందంలో ఉన్నారు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న దర్శకుడు బుచ్చిబాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు. సుకుమార్ తరహాలోనే ఉప్పెన రూపంలో ఓ విభిన్నమైన, సాహసోవంతమైన, అందమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచాడు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది.

బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సహాంలో వున్నాను.. అంటూ వేదికపై చెప్పిన దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబుకు ప్రేమతో ఓ లేఖను రాశారు. ఇప్పుడా లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద పెద్ద దర్శకుల శిష్యులు కూడా ఇంతకు ముందు దర్శకులయ్యారు. కానీ ఏ దర్శకుడూ ఈ స్థాయిలో తన శిష్యుడిపై ప్రేమ చూపలేదు. ఇంకా చెప్పాలంటే.. తనే ఓ శిష్యుడిగా మారిపోతున్నాడంటూ.. సుకుమార్ ఎక్స్‌ప్రెస్ చేసిన ఎమోషన్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనే చెప్పాలి.

Sukumar unconditional love on buchibabu sana

‘‘నువ్వు నన్ను గురువును చేసే సరికి… నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా…?? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సానా బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు – సుకుమార్’’ అంటూ సుకుమార్ రాసిన ఈ లేఖ అందరిని అలరిస్తుంది.

ఓ శిష్యుడి పట్ల గురువు ప్రేమను చూసి అందరూ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఓ శిష్యుడిని దర్శకుడిగా చూడాలనే తపన, అతని సినిమా కోసం ఓ గురువు ప్రేమ, ఇదంతా సినీ పరిశ్రమలో చాలా అరుదు అంటూ.. వీరి గురుశిష్యుల బంధానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM