Cinema

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ‘ముత్తయ్య’ టీజర్ విడుదల

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది “ముత్తయ్య” సినిమా టీజర్. ఈ టీజర్ ను నేచురల్ స్టార్ నాని శనివారం విడుదల చేశారు. 24 ఏళ్ల వయసులో నాకు “అష్టా చమ్మా” సినిమాలో అవకాశం రాకుంటే 70 ఏళ్లకు నేనూ ముత్తయ్యలాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది అంటూ స్పందించారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ అంటూ విశెస్ చెప్పారు. కె సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు బ్యానర్స్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సమర్పణలో వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. మే 9న లండన్ లోని రిచ్ మిక్స్ లో ప్రీమియర్ కానుంది.

టీజర్ విడుదల సందర్భంగా చిత్ర సమర్పకులు కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి మాట్లాడుతూ… మా సినిమా టీజర్ ను నాని విడుదల చేయడం సంతోషంగా ఉంది. మా సంస్థ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. ముత్తయ్య ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచే సినిమా అవుతుంది. అన్నారు.

నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ… మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు నానికి థాంక్స్. జీవితంలో ఏదైనా సాధించాలని కలగనే ప్రతి ఒక్కరూ ముత్తయ్యలో కనిపిస్తారు. అలాంటి వారి భావోద్వేగాలను దర్శకుడు భాస్కర్ మౌర్య ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. మా సినిమా యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. ప్రెజెంటర్స్ హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థకు కృతజ్ఞతలు. అన్నారు.

దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ… తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రయత్నించే ఎంతోమంది వ్యక్తుల ఆరాటానికి ప్రతిబింబం ఈ సినిమా. అలాంటి వాళ్ల నుంచి స్ఫూర్తి పొందే ఈ కథ రాసుకున్నాను. నా కథను అందంగా తెరకెక్కించేందుకు సహకరించిన టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.

టి సాయి లీల, జయవర్థన్ సాగర్, కిరణ్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – దివాకర్ మణి, సంగీతం – కార్తీక్ రోడ్రిగ్వజ్, ఎడిటర్ – సాయి మురళి, సహ నిర్మాత – దివాకర్ మణి, నిర్మాత – వ్రిందా ప్రసాద్, సమర్పణ – కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం – భాస్కర్ మౌర్య.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM