‘ఇన్స్ పెక్టర్ రిషి’.. ట్రైలర్ సోషల్ మీడియాలో Naveen Chandra Inspector Rishi Web Series Released In Social Media
నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి”. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె.ఎస్. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమోజాన్ తమిళ్ ఒరిజినల్ గా “ఇన్స్ పెక్టర్ రిషి” ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతోంది. క్వీన్ కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర “సత్యాభామ” అనే సినిమాలో పెయిర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్ లో “ఇన్స్ పెక్టర్ రిషి” వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూసి ఇంప్రెస్ అయిన కాజల్ అగర్వాల్ ట్రైలర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న కాజల్ అగర్వాల్… నవీన్ చంద్రతో పాటు వెబ్ సిరీస్ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.
తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. సీబీ సీఐడీకి కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి వస్తాడు కొత్త ఇన్స్ పెక్టర్ రిషి. ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషి అతని పోలీస్ టీమ్ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. తీన్ కాడు ప్రాంత వరుస హత్యలకు దెయ్యమే కారణమైతే అందుకు పరిష్కారాన్ని ఇన్స్ పెక్టర్ రిషి ఎలా కనుక్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…