Power star Pawan Kalyan and Rana daggubati combination in sithara entertainments movie regular shoot started, పవన్ కల్యాణ్, రానా కాంబో చిత్ర షూటింగ్ మొదలైంది
టాలీవుడ్ అగ్రనటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాలదేవ రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్ర రెగ్యులర్ షూటింగ్ సోమవారం (జనవరి 25) ప్రారంభం అయింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తున్న విషయం విదితమే.
చిత్ర షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి.. ఇద్దరూ పాల్గొనగా పది రోజులపాటు హైదరాబాద్‌లో చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాము. మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్రివిక్రమ్ సపోర్ట్ మరిచిపోలేనిది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.
ప్రముఖ నటులు సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రాహకునిగా, ఎడిటర్‌గా నవీన్ నూలి, కళా దర్శకునిగా ఏ.ఎస్. ప్రకాష్.. ఇప్పటివరకు ఎంపిక అయ్యారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియపరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి సమర్పకులుగా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. పి.ఆర్.ఓ: యల్.వేణుగోపాల్.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…