Cinema

ఏప్రిల్‌లో విడుదలైన పవన్ కల్యాణ్ చిత్రాలివే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలతోనూ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చినప్పటికీ.. రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు ప్రకటిస్తూ.. అభిమానులను ఖుషి చేస్తున్నాడు. రీ ఎంట్రీలో ఆయన నటించిన మొదటి చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మేకర్స్ ఎప్పుడయితే ఏప్రిల్ అని ప్రకటించారో.. ఆయన అభిమానులు ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ నటించి విడుదలైన చిత్రాలను డేట్స్‌తో సహా ప్రకటిస్తూ.. సక్సెస్ రేటును కొలుస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రం కంటే ముందు పవన్ కల్యాణ్ నటించిన 6 చిత్రాలు ఏప్రిల్‌లో విడుదల అయ్యాయి. వాటి వివరాలకి వస్తే.. పవన్ కల్యాణ్, ఇలియానా నటించిన జల్సా చిత్రం ఏప్రిల్ 2న విడుదలై మంచి విజయం సాధించింది. ఏప్రిల్ 8న పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ కాంబోలో తెరకెక్కిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విడుదలైంది. ఈ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే.

పవన్ కల్యాణ్, త్రిష జంటగా నటించిన ‘తీన్‌మార్‘ చిత్రం ఏప్రిల్ 14న విడుదలైంది. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్, అమీషా పటేల్ కాంబినేషన్‌లో రూపొందిన ‘బద్రి’ చిత్రం ఏప్రిల్ 20న విడుదలైంది. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కాంబినేషన్‌లో పవన్ దర్శకత్వంలో రూపొందిన ‘జానీ’ చిత్రం ఏప్రిల్ 25న విడుదలైంది. పవన్ కల్యాణ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఖుషి’ చిత్రం ఏప్రిల్ 27న విడుదలైంది. భూమిక ఈ చిత్రంలో హీరోయిన్. వేరు వేరు సంవత్సరాలలో విడుదలైన ఈ ఆరు చిత్రాలను కలిపి చూస్తే.. పవన్ కల్యాణ్‌కు ఏప్రిల్‌లో సక్సెస్ రేట్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు.

ఈ లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 9న రాబోతోన్న ‘వకీల్ సాబ్’ కూడా భారీ విజయాన్ని సాధించడం ఖాయం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Posts

ఆరామ ద్రావిడ బ్రాహ్మణ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన.. హాజరైన పురాణపండ

అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు. అహంకారాలొద్దు. బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా ప్రముఖ…

November 18, 2024 at 9:56 PM

‘టర్నింగ్‌ పాయింట్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌) హీరోగా, హెబ్బాపటేల్‌, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్‌ పతాకంపై…

November 14, 2024 at 10:09 PM

‘రాబిన్‌హుడ్’ టీజర్ విడుదల- డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్…

November 14, 2024 at 10:04 PM

పుష్పగిరి పీఠాధీశ్వరులు ఆవిష్కరించిన పురాణపండ ‘ఆనంద నిలయం’

క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు... ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు…

November 1, 2024 at 12:37 PM

ఇంద్రకీలాద్రిపై ‘దేవీం స్మరామి’.. భాగ్యనగరంలో ‘దుర్గే ప్రసీద’తో ఆకట్టుకున్న పురాణపండ

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…

October 11, 2024 at 1:09 PM

దేవీచౌక్ అమ్మవారి ఉత్సవాల్లో మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…

October 6, 2024 at 8:21 PM