ఏప్రిల్ 28 ఏం జరిగింది రిలీజ్ డేట్ ఫిక్స్ | April 28th Em Jarigindi Release date
‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ చిత్రం గురించి ఈ మధ్య సోషల్ మీడియా బాగా టాక్ నడుస్తుంది. కొందరు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి చెబుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు వీరాస్వామి. జి మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన మా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర విజయంపై మాకు మరింత విశ్వాసం కలిగింది. తప్పకుండాఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారనే నమ్మకం ఉంది అంటున్నారు.
దర్శకుడు వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుంది. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ అనే డిఫరెంట్ టైటిల్‌తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించిన మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేస్తాం.. అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…