Politics

YS Sharmila: కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో ఫ్రంట్ పేజీలోనే సంచలన కథనం వచ్చిన విషయం విదితమే. ఆ కథనం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనమైంది. పలువురు ప్రముఖులు దీనిపై స్పందించి స్వాగతించగా.. మరికొందరు మాత్రం అస్సలు జరిగే పనే కాదని చెప్పుకొచ్చారు. అయితే మౌనానికి అంగీకారమేనని అందరూ అనుకుంటున్న తరుణంలో వైఎస్ షర్మిల స్పందించి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ సంచలన కథనంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకటన యథావిధిగా..
‘‘ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌గారి కుటుంబాన్ని టార్గెట్‌ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా, ఏ చానల్‌ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నాను’’ అని షర్మిల ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తానికి చూస్తే.. కొత్త పార్టీపై క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో.. కొత్త పార్టీ లేదని ఈ ప్రకటనతో షర్మిల చెప్పేశారన్న మాట. మరి షర్మిల క్లారిటీ ఇచ్చింది కాబట్టి.. ఇకనైనా షర్మిళ కొత్త పార్టీ వార్తలు ఆగుతాయో.. లేదంటే మరో కోణంలో ప్రజంట్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM