sai tej and dev katta republic motion poster out, సాయితేజ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్ వదిలారు
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా.. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది.
చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ.. ‘‘‘రిపబ్లిక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో సాయి తేజ్ హీరోగా దేవ కట్టగారి దర్శకత్వంలో రూపొందుతోన్న మా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు… ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమవుతుంది. ప్రభుత్వమవుతుంది….అదే అసలైన రిపబ్లిక్’’ అంటూ సాయి తేజ్ వాయిస్‌లో టైటిల్ అర్థాన్ని చెప్పి మోషన్ పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు.
సాయి తేజ్, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దేవ కట్ట, కిరణ్ జయ్‌కుమార్, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్, ఆర్ట్: శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీశ్ బీకేఆర్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, రెహమాన్, పి.ఆర్.ఓ: వంశీ కాక, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు; కథ, మాటలు, దర్శకత్వం: దేవ కట్టా
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…