విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎపిక్ సాగా ‘కల్కి 2898 AD’. మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును ‘భైరవ’గా పరిచయం చేశారు మేకర్స్.
‘కల్కి 2898 AD’ టీమ్ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. “కాశీ భవిష్యత్తు వీధుల నుంచి ‘భైరవ’ని పరిచయం చేస్తున్నాము” అని పేర్కొన్నారు.
ప్రభాస్ దృఢమైన శరీరాకృతితో కాల భైరవ వలె విధ్వంసకరంగా కనిపిస్తుండగా, బ్యాగ్ గ్రౌండ్ లో భవిష్యత్తు కాశీ కనిపిస్తోంది. ఆధ్యాత్మిక భూమిని అటువంటి స్థితిలో చూడటం అన్ బిలివబుల్ గా వుంది. ప్రభాస్ స్పోర్ట్స్ పోనీటైల్ తో కనిపించారు. అతని డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. టెక్నో షేడ్స్ ధరించడంతో పాటు చేతిపై పచ్చబొట్టు ఉంది.
కల్కి 2898 AD కథ 3101 BCEలో మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 AD కాలల మధ్య వుంటుంది. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అద్భుతమైన ప్రదేశాలలో ప్రభాస్, దిశా పటానీలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్న ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ మూవీలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు. అహంకారాలొద్దు. బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా ప్రముఖ…
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్…
క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు... ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు…
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…