Categories: CinemaLatestTopStory

పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ట్రైలర్ విడుదల

ఇటీవల కాలంలో సినీ ప్రియుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇవాళ  “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అసాధారణ మేకింగ్ తో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “ది గోట్ లైఫ్” ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేలా ట్రైలర్ కట్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వివిధ గెటప్స్ లో కనిపించిన తీరు, అద్భుతమైన విజువల్ క్యాప్షర్, విశాలమైన ఎడారి లొకేషన్స్, హీరో క్యారెక్టర్ అయిన నజీబ్ జీవితంలోని భావోద్వేగాలను హార్ట్ టచింగ్ గా ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా

దర్శకుడు బ్లెస్సీ మాట్లాడుతూ – నా దృష్టిలో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) లాంటి గొప్ప సర్వైవల్ అడ్వెంచర్ సినిమా ఇప్పటివరకు వెండితెరపై రాలేదు. ఇలాంటి ఘటనలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు. కల్పన కంటే నిజం వింతగా ఉంటుంది. ‘మనకు ఎదురుకాని అనుభవాలన్నీ మిథ్యే అనుకుంటాం’ అనేది ఈ సినిమాకు ఆధారమైన నవలలో ఒక ట్యాగ్ లైన్. గాంధీ సినిమాను రూపొందించేందుకు దర్శకుడు రిచర్డ్ అటెన్ బరోకు 20 ఏళ్లు పట్టింది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా మేకింగ్ కోసం మేము పదేళ్లు సమయం తీసుకున్నాం. తెరపై మేము ఆవిష్కరించబోతున్న కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ – ఈ సినిమా కోసం మా టీమ్ అంతా చాలా కష్టమైన సుదీర్ఘ ప్రయాణం చేశాం. పదేళ్ల మా శ్రమ తర్వాత మా సినిమాను ప్రేక్షకులు తెరపై చూడబోతున్నారనే సంతోషం కలుగుతోంది. కోవిడ్ టైమ్ నుంచి మేమంతా అనుకోని, మర్చిపోలేని ప్రయాణం ఈ సినిమాతో చేశాం. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) లాంటి గొప్ప సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది. దర్శకుడు బ్లెస్సీ అద్బుతమైన విజన్, ఆ విజన్ కు తన సంగీతంతో ఏఆర్ రెహమాన్ ప్రాణం పోశారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) మా దృష్టిలో కేవలం సినిమా మాత్రమే కాదు మా మనసుల్ని తాకిన ఒక గొప్ప కథ. ఈ కథ మా జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేక్షకులు కూడా ఇలాగే అనుభూతి చెందుతారని కోరుకుంటున్నాం. అన్నారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

Recent Posts

ఇంద్రకీలాద్రిపై ‘దేవీం స్మరామి’.. భాగ్యనగరంలో ‘దుర్గే ప్రసీద’తో ఆకట్టుకున్న పురాణపండ

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…

October 11, 2024 at 1:09 PM

దేవీచౌక్ అమ్మవారి ఉత్సవాల్లో మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…

October 6, 2024 at 8:21 PM

‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముఖ్యాంశాలు

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌,…

October 5, 2024 at 12:58 PM

రికార్డులు బద్ధలు కొడుతున్న ‘డీమాంటే కాలనీ 2’

నేషనల్‌, అక్టోబర్‌xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో…

October 5, 2024 at 12:29 PM

గోపీచంద్ ‘విశ్వం’ థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…

October 5, 2024 at 12:19 PM

ఆలియాభట్‌ “ఆల్ఫా” వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…

October 5, 2024 at 12:11 PM