వైసీపీలో విజయసాయికి ప్రియారిటీ తగ్గిపోయిందా!?, putting aside vijayasai reddy in ysrcp
ఏపీ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు, కీలక నేత విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీలో నంబర్-02గా అన్ని కార్యక్రమాలు చక్కబెడుతూ వస్తుండేవారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వైసీపీ కనివినీ ఎరుగని స్థాయిలో ఘన విజయం సాధించడంలోనూ సాయిరెడ్డి పాత్ర చాలానే ఉంది. ఫలితాల అనంతరం ఆయనకు కేంద్రంలోని బీజేపీతో కలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో.. అటు ఢిల్లీ రాజకీయాల్లో ఈయన కీలక వ్యక్తిగానే ఉంటూ వచ్చారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఈ మధ్య సాయిరెడ్డి పెద్దగా కనిపించట్లేదు. సొంత పార్టీ నేతలే.. మరీ ముఖ్యంగా ఆయనకుండే నంబర్-02 అనే ముద్రను పీకేయడానికో తెలియట్లేదు కానీ పెద్దగా పట్టించుకోవట్లేదట.
జగన్ ఎక్కడికెళ్లినా.. ఏ మీటింగ్ జరిపినా.. సీఎంకు రైట్ హ్యాండ్‌గా ఉండే విజయసాయి ఈ మధ్య జగన్ పక్కన ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం బయటికి రావట్లేదు. దీంతో సాయిరెడ్డికి అనుకూలంగా ఉండే కొందరు నేతలు ఆయన పరిస్థితే అలా ఉంటే.. ఆయన్ను నమ్ముకున్న వారి పరిస్థితేంటి..? అన్నట్లు ఆలోచనలో పడ్డారట. వాస్తవానికి ప్రతిపక్షాలు చేసే విమర్శలు మీడియా మీట్ పెట్టి మరీ ఓ రేంజ్‌లో విరుచుకుపడే విజయసాయి ఇప్పుడు ఎక్కడో ఒకటి అరా వేదికల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఆ మధ్య రామతీర్థం ఘటనప్పుడు మాత్రమే కనిపించారు. ఆ తర్వాత కనిపించట్లేదు. ఆయనకు కోరలు కత్తింరించేశారని కొందరు సొంత పార్టీ నేతలు అంటుంటే..? ఇంకొందరు మాత్రం అసలు వైసీపీలో ఏం జరుగుతోంది..? అంటూ ప్రశ్నించుకుంటున్నారట. మరికొందరు మాత్రం సాయిరెడ్డి అనవసరం లేనిపోని విమర్శలు గుప్పిస్తూ.. అక్కర్లేని విషయాల్లో వేలు పెడుతుంటాడు కాబట్టి జగన్ తోక కత్తిరించారనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇదివరకు సాయిరెడ్డి చేసే పనులన్నీ చాలా వరకు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్థానాన్ని ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి భర్తీ చేస్తున్నారట. మీడియా ముందుకు రావడం.. చంద్రబాబు మొదలుకుని ఎవర్నయినా సరే విమర్శించేయడం చేస్తున్నారు. వాస్తవానికి సీఎం జగన్‌కు సాయిరెడ్డి ఎంతో.. సజ్జల కూడా అంతేనని అప్పట్లో టాక్ నడిచేది. ఆయన మంచి బిజినెస్‌మెన్.. పైగా జగన్ ఏ బహిరంగ సభలో మాట్లాడాలన్నా స్క్రిప్ట్ కూడా రాస్తారట. ఇవన్నీ అటుంచితే సజ్జలది.. జగన్ సొంత ఇలాకానే.. సొంత సామాజిక వర్గమే. అందుకే జగన్ కూడా సజ్జలకు అంత ప్రియారిటీ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజానిజాలెంటో అటు సాయిరెడ్డికి.. ఇటు సజ్జలకు.. వీరిద్దరి పైనుండే ఆ సీఎం జగన్‌కే తెలియాలి మరి.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…