rishabh pant turns delhi capitals captain Ipl 2021
సూపర్ ఫామ్‌తో అందరి ప్రశంసలూ అందుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు భారీ ప్రమోషన్. ఈ యువ ప్లేయర్ జట్టులో కీపర్ స్థాయి నుంచి ఇప్పుడు కెప్టెన్‌గా ఎదిగాడు. ఈ విషయాన్ని సదరు జట్టు మేనేజ్‌మెంట్ స్వయంగా ప్రకటించింది కూడా. కాకపోతే ఇది టీమిండియాకు సంబంధించిన న్యూస్ కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదేనండీ మన ఐపీఎల్‌లో పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ విషయం. తమ జట్టుకు రిషభ్ పంతే కెప్టెన్ అని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్ అయ్యర్ సారధిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అద్భుతంగా జట్టును ముందుకు నడిపించిన శ్రేయాస్.. జట్టును సీజన్ ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు. ఆటతీరు కూడా అద్భుతంగా ఉండటంతో టీమిండియా నుంచి అతనికి పిలుపు వచ్చింది. అయితే ఇంగ్లండ్‌తో తొలి వన్డే సమయంలో శ్రేయాస్‌కు గాయం అయింది. దీంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో పంత్‌ను కెప్టెన్‌గా చేస్తున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.
ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ ఎడమ చేతికి తీవ్రమైన గాయమైంది. బంతిని ఆపేందుకు డైవ్ చేసిన సమయంలో అతడి భుజం గట్టిగా నేలను ఢీకొంది. దీంతో మైదానంలోనే అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ వెంటనే మైదానాన్ని వీడాడు. అనంతరం మెడికల్ సిబ్బంది అతడికి అనేక టెస్టులు చేశారు. ఈ గాయం చాలా తీవ్రమైందని తేల్చారు. ఈ గాయం వల్లనే అతడు ఆ మ్యాచ్‌లో మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అలాగే ఆ తర్వాతి రెండు వన్డేలకు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2021 నుంచి నుంచి కూడా పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనకు, సెప్టెంబర్‌లో స్వదేశంలో జరగనున్న న్యూజిలాండ్, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు కూడా పూర్తిగా దూరమైనట్లు సమాచారం.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…