Cinema

Sai Tej Republic: సాయితేజ్‌ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్ వదిలారు

‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా.. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘రిప‌బ్లిక్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ సోమ‌వారం విడుదల చేసింది.

చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల సంద‌ర్భంగా నిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ.. ‘‘‘రిపబ్లిక్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో సాయి తేజ్ హీరోగా దేవ క‌ట్ట‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మా సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేలా స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

‘‘యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజ‌కీయ నాయ‌కులు.. శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వోద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టులు… ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్రమ‌బ‌ద్దంగా సాగిన‌ప్పుడే అది ప్ర‌జాస్వామ్య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వ‌మ‌వుతుంది….అదే అస‌లైన రిప‌బ్లిక్‌’’ అంటూ సాయి తేజ్ వాయిస్‌లో టైటిల్ అర్థాన్ని చెప్పి మోష‌న్ పోస్ట‌ర్‌ను డిఫ‌రెంట్‌గా డిజైన్ చేశారు.

సాయి తేజ్, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌, బాక్స‌ర్ దిన తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్‌కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌, ఆర్ట్‌: శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: స‌తీశ్ బీకేఆర్‌, పాట‌లు: సుద్దాల అశోక్ తేజ‌, రెహ‌మాన్‌, పి.ఆర్‌.ఓ: వ‌ంశీ కాక‌, నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు; క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: దేవ క‌ట్టా

Recent Posts

పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

April 14, 2025 at 8:10 PM

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM