Featured

పాల గ్లాస్ అనుకున్నారా?.. కాదు కల్లు గ్లాస్!!

సింగర్ సునీత.. ఈమె తెలియని వారుండరు. ఎందుకంటే తన అందమైన గాత్రంతో ఎందరినో మైమరపించి, మంత్రముగ్దుల్ని చేసేసింది. సంప్రదాయమైన చీరకట్టుతో ఎప్పుడు నవ్వుల పువ్వులు పూయిస్తూ ఆకట్టుకుంటుంది. ఎన్నో అద్భుతమైన పాటలు ఈమె సొంతం. ఈమధ్యే ఈమె రెండవ పెళ్లి చేసుకుని మరో ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. పెళ్లి తరువాత ఈమెలో ఉన్న జోష్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ మధ్య తరచూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఇంకాస్త దగ్గరయ్యి తన భర్త, మ్యారేజ్ తరువాత తాను ఎంత సంతోషంగా ఉందో తన ప్రేక్షకులతో పంచుకుంటుంది. అటువంటిదే తాజాగా మరో విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకుంది.

అదేమిటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రగతి రిసార్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓ చల్లని పానీయం ఉన్న గ్లాస్ తో ఫొటోలకి ఫోజులిచ్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పానీయం పాలో, మజ్జిగో అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అది స్వచ్ఛమైన తాటి కల్లు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు గాయత్రీ భార్గవి, మరి కొందరు తనతో పాటు కల్లు గ్లాసులతో కనిపించారు.

ఈ వెచ్చటి వేసవి కాలంలో చల్లటి తాటి కల్లు తాగడం అనేది చాలా ప్రదేశాలలో జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా సెలబ్రిటీలు కల్లు గ్లాసులతో కనిపించటం అనేది మాత్రం విచిత్రమే. అసలు ఇంతకీ ఆ కల్లుని సునీత అండ్ టీం తాగారా లేదా అనేది సెకండ్ థింగ్. కానీ ఇలా గ్లాసులతో దర్శనమిస్తే ఇంకేముంది గోరంతని కొండంత చేసే మన సోషల్ మీడియా మాత్రం తాగారనే చెబుతుంది. అదీ అసలు సంగతి. మరికొందరైతే.. కొత్తగా పెళ్లి అయినా ఈ అమ్మడి చేతిలో పాల గ్లాసు కనిపించాలి కానీ.. ఇలా కల్లు గ్లాస్‌ ఏమిటి? అనే వారు కూడా లేకపోలేదు.. ఏదిఏమైతేనేం.. ప్రస్తుతం ఈ ఫొటోలు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Posts

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM