Cinema

జాక్ చిత్రం ట్రైలర్ ఈవెంట్‌లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ ప్రసంగం

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ… ‘బొమ్మరిల్లు గారు జాక్ కథను  చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది. భాస్కర్ గారు జానర్ మార్చడం వల్ల జాక్ చాలా కొత్తగా అనిపిస్తుంది. టిల్లు, టిల్లు స్క్వేర్ కారెక్టరైజేషన్ ఏ మీటర్‌లో ఉంటుందో.. జాక్ అంతకు మించి ఉంటుంది. టిల్లు అనేది కారెక్టరే బేస్డ్ సినిమా అయితే.. జాక్‌లో కారెక్టర్‌తో పాటు అదిరిపోయే కథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఛార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. జాక్ ఐడియానే అద్భుతంగా ఉంటుంది. ఆ ఐడియా నుంచి వచ్చిన సీక్వెన్స్ ఇంకా బాగుంటాయి. భాస్కర్ గారు ఈ సినిమా కోసం దగ్గరదగ్గరగా రెండేళ్లు పని చేశారు. రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. చాలా రేసీగా ఉంటుంది. జాక్ అనేది నిజంగానే క్రాక్ లాంటి పాత్ర. చాలా ట్విస్టులు ఉంటాయి. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది. అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ… ‘బీవీఎస్ఎన్ ప్రసాద్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. బాపీ నాకు మంచి స్నేహితుడు. ఒకసారి జాక్ పాయింట్ ఆయనకు చెప్పాను. వెంటనే సిద్దుతో మీటింగ్ జరగడం, ఒక్కరోజులోనే ప్రాజెక్ట్ సెట్ అవ్వడం జరిగింది. సిద్దు లాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా చాలా సులభం. సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు. ఆ సీన్ అద్భుతంగా వస్తుంది. రైటింగ్ స్టేజ్ నుంచే సిద్దు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. జాక్ థీమ్ మాత్రమే నేను రాశాను. జాక్ కారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్‌లో సిద్దుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. సిద్దు చాలా ఇంప్రవైజ్ చేశాడు. జాక్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరిలోనూ జాక్ ఉంటాడు. ఆ జాక్ ఎవరు? అనేది ఎవరిది వాళ్లే తెలుసుకోవాలి. ఈ సినిమా నా స్టైల్లోనే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ను నమ్మి వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను నేను నిరాశ పర్చను. పైన సిద్దు ఫ్లేవర్ కనిపించినా లోలోపల నా స్టైల్లో ఉండే ఎమోషన్, మెసెజ్ అన్నీ ఉంటాయి. వైష్ణవి చైతన్య కళ్లతోనే నటించేశారు. ఆమె చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. చాలా మంచి నటి. ఏప్రిల్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ… ‘బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. చిన్నప్పుడు ఆయన పాటలకు వైబ్ అవుతుండేదాన్ని. అలాంటి స్థాయి నుంచి ఈ రోజు ఆయన సినిమాలో నటించడం, ఆయన పాటల్లో కనిపించడమే నా సక్సెస్. సిద్దు గారు సెట్స్‌లో ఎంతో సపోర్ట్ చేసేవారు. ఆయన సినిమా పట్ల ఎంతో డెడికేటెడ్‌గా, ప్యాషనేట్‌తో ఉంటారు. సెట్స్‌లో ఆయన సీన్లను ఇంప్రోవైజ్ చేసే తీరు చూసి నేను భయపడేదాన్ని. సిద్దు లాంటి గొప్ప యాక్టర్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. జాక్ సినిమా ఏప్రిల్ 10న రాబోతోంది. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ… ‘బొమ్మరిల్లు భాస్కర్‌తో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన దర్శకత్వంలో సిద్దు హీరోగా జాక్ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మా మూవీ ఏప్రిల్ 10న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు

Recent Posts

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం టైటిల్ సాంగ్ లిరికల్‌ వీడియో విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ…

April 4, 2025 at 8:11 PM

విశ్వంభర లో నా కల నెరవేరింది: నటుడు ప్రవీణ్

తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ త‌రం న‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో…

April 4, 2025 at 8:04 PM

ఒక బృందావనం చిత్రం నుంచి లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల

ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా…

April 4, 2025 at 7:30 PM