మరో హీరోయిన్‌కి తంబీలు.. గుడి కట్టేశారు | Temple to Heroine Nidhhi Agerwal
Nidhhi Agerwal Temple: హీరోయిన్లు అంటే అభిమానం ఉండడం అనేది సహజం. అభిమానం ఉంటే ఆమె పుట్టిన రోజున కేక్ కట్ చేసి, పార్టీలు చేసుకోవడం అనేది కూడా సర్వ సాధారణం. కానీ వీరి అభిమానం మాత్రం కట్టలు తెంచుకుంది అంటే అతిశయోక్తి కాదు. అసలు విషయంలోకి వెళితే హీరోయిన్ మీద అభిమానంతో ఏకంగా ఒక విగ్రహం చేయించి గుడి కట్టేశారు అభిమానులు. ఆమె విగ్రహానికి పాలాభిషేకాలు, ఆ విగ్రహం ముందు కేక్ కటింగ్ చేయడం, ఆమెకి ధూప, దీప, నైవేద్యాలు, హారతి కూడా సమర్పించుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారు కదా.. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను సినిమాలలో నటించిన నిధి అగర్వాల్. తనకి గుడి కట్టారని తెలిసిన ఆ భామకి.. షాక్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టిందట.
తమిళ తంబీలకు నచ్చిన వారికి గుడి కట్టడం తమిళనాడులో సాధారణ విషయమే. ఇంతకుముందు ఖుష్బూ, నమిత, హన్సికలకు కూడా వారు ఇలాగే గుడి కట్టి ఆరాధించారు. ఇప్పుడు వారి లిస్ట్‌లోకి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా చేరింది. కనీసం స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోక ముందే ఇలా అభిమానులు గుడి కట్టడం చూస్తుంటే.. ఎలా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదంటుంది నిధి. ఇదంతా కూడా చెన్నైలో జరిగింది. ఈ భామ తమిళంలో నటించింది కేవలం రెండు సినిమాలే అయినప్పటికీ అభిమానులు ఇలా గుడి కట్టడం అనేది చెప్పుకోవాల్సిన విషయమే మరి.
మాములుగా అయితే తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే బాగా ఇష్టం. అందుకే ఇప్పటి వరకు వారు గుడి కట్టిన లిస్ట్‌లో బొద్దుగుమ్మలే ఉన్నారు. తొలిసారి వారు బక్కబలిచిన భామకు గుడి కట్టడం విశేషం. సన్నగా ఉంటేనేమీ.. నిధిలో అందాల నిధి ఏమైనా తక్కువ ఉందా? ఆ నిధికే పడిపోయారు తంబీలు. ఈ వార్తతో ఇప్పుడు నిధి అగర్వాల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…