Technology

wifi speed: వైఫై స్పీడ్ స్లోగా ఉందా? అయితే ఇలా చేయండి

మంచి బ్రాడ్ ‌బ్యాండ్‌తో నెట్ కనెక్షన్ ఉన్నా.. వైఫై విషయానికి వస్తే.. స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఎందరో ఫేస్ చేస్తున్న సమస్య. పేరుకేమో బ్రాండ్.. నెట్ చూస్తే మాత్రం మరీ చీప్‌గా వస్తుండటంతో.. వెంటనే మార్చాలని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే వైఫై వేగాన్ని బ్రాడ్ బ్యాండ్ మార్చకుండా కూడా పెంచుకునే అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే చాలు.. ఈజీగా వైఫై స్పీడ్‌ను సెట్ చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..

– మొదట చేయాల్సింది ఏమిటంటే వైఫైకు కనెక్ట్ అయి ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్ కనెక్ట్ చేసుకోవాలి. వైఫై రూటర్ పక్కన ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అలాగే ఐరన్‌కు చెందిన వస్తువులు లేకుండా చూసుకోవాలి.

– కొన్ని ప్రదేశాలలో నిలబడినప్పుడు, లేదంటే.. రూటర్‌కి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్ వస్తుంటే.. వైఫై రూటర్ ఉన్న స్థానాన్ని సరైన ప్రదేశంలో సెట్ చేసుకోవాలి. ఇంటికి మధ్యలో ఉండే ప్రదేశం అయితే చాలా బెటర్.

– ఒక్కోసారి రూటర్‌కి ఉంటే అడాప్టర్‌ లేదంటే ప్లగ్ కూడా ఖరాబై ఉండవచ్చు. వాటిని కూడా చెక్ చేసుకోవాలి.

– కొన్నిసార్లు షాపుల్లో ఇది చాలా మంచి రూటర్ అని షాపు వాళ్లు మనకి అంటగడుతుంటారు. అలా కాకుండా రూటర్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డ్యూయల్ బ్యాండ్ 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్‌ని ప్రయారిటీని బట్టి తీసుకుంటే మంచిది.

– నెట్ వేగాన్ని చూసుకునేందుకు స్పీడ్ టెస్ట్. నెట్, ఫాస్ట్. కామ్ వంటి వాటిలో చూసుకోవచ్చు.

-రూటర్‌కు ఎక్కువగా సిగ్నల్స్ అంటే.. ఇతర నెట్ వర్క్ సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటే.. ఆ సిగ్నల్స్ రూటర్‌పై ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రూటర్‌లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి.

– రూటర్ యాంటిన్నా పొజిషన్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. యాంటిన్నా స్థానం మార్చినప్పుడు కూడా స్పీడ్‌లో మార్పులుంటాయి.
ఇవన్నీ చేసినా కూడా స్పీడ్‌లో ఎటువంటి మార్పు రాకుంటే.. రూటర్‌ని మార్చడమో లేదంటే.. మరో కొత్త నెట్ కనెక్షన్ తీసుకోవడమో చేస్తే బెటర్.

Share
Published by
Just Teaser

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM