sukumar launches ardhashathabdam movie teaser: సుకుమార్ వదిలిన అర్థ శతాబ్ధం టీజర్
సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అర్థ శతాబ్ధం’ చిత్ర టీజర్ విడుదలైంది. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో, చిట్టి కిరణ్ రామోజు తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘అర్థ శతాబ్ధం పవర్ ఫుల్ టైటిల్. చాలా బాగుంది. టీజర్ చాలాఇంట్రస్టింగా ఉంది. రవీంద్ర టేకింగ్ ఎక్స్‌లెంట్‌గా ఉంది. ఈ సినిమా సక్సెస్ అయి నిర్మాతలకు మంచి లాభాలు తేవాలి. ఈ సందర్భంగా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను..’’ అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్‌గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..’’ అన్నారు.
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్, రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే, నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ, డిఓపి: ఎజే వేణు, అష్కర్, వెంకట ఆర్ శాఖమూరి; సంగీతం: నౌఫల్ రాజా(ఎ.ఐ.ఎస్).
దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…
వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…
-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…
హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…
హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్స్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్…
దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…