Cinema

‘టర్నింగ్‌ పాయింట్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌) హీరోగా, హెబ్బాపటేల్‌, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్‌ పతాకంపై సురేష్‌ దత్తి నిర్మిస్తున్న చిత్రం ‘టర్నింగ్‌ పాయింట్‌’. ఈ చిత్రానికి కుహన్‌ నాయుడు దర్శకుడు. గురువారం ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సన్సేషనల్‌ మాస్‌ స్టార్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌కు సస్సెన్స్‌తో పాటు మాస్‌ అంశాలను జోడించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ గారు, విజయ్‌ గారు విడుదల చేయడం ఎంతో సంతోషంగా వుంది. వాళ్లు అందించిన సప్టోర్ట్‌ మరువలేనిది.త్వరలోనే చిత్రం టీజర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా టర్నింగ్‌ పాయింట్‌ చిత్రం మా టీమ్‌ అందరికి కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాను. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రంలో అలరించే అంశాలు చాలా వున్నాయి’ అన్నారు.

దర్శకుడు కుహన్‌ నాయుడు మాట్లాడుతూ… ‘ మాస్‌ సన్సేషనల్‌ స్టార్‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు విజయ్‌ కనకమేడల మా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్‌ ఏపిసోడ్స్‌ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ఆడియన్స్‌ ఎంగేజ్‌ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను కూడా విడుదల చేస్తాం’ అన్నారు.

త్రిగుణ్‌ (అదిత్‌ అరుణ్‌), హెబ్బా పటేల్‌, ఇషా చావ్లా, వర్షిణి, రాశి, చమ్మక్‌ చంద్ర, రంగస్థలం మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రామకృష్ణ, మల్లేష్‌, ఎడిటర్‌: నాగిరెడ్డి, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధ్రువన్‌, కెమెరా: గరుడ వేగ అంజి, లైన్‌ ప్రొడ్యూసర్‌: కుమార్‌ కోట, కో-ప్రోడ్యూసర్స్‌: నందిపాటి ఉదయభాను, ఎం.ఫణి భూషణ్‌ కుమార్‌, జీఆర్‌ మీనాక్షి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అలిజాల పాండు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: రవి ఓలేటి, నిర్మాత: సురేష్‌ దత్తి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: కుహన్‌ నాయుడు.

Recent Posts

పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

April 14, 2025 at 8:10 PM

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM