Two University of Lahore students
ప్రేమ… ఈ పదం ఎంతో అపురూపమైనది. అది భార్య భర్తల మధ్య కావచ్చు, తల్లి దండ్రులు, పిల్లల మధ్య కావచ్చు… లేదంటే ఒక అమ్మాయి, అబ్బాయి టీనేజ్ లో వారి మధ్య ఏర్పడే ప్రేమ కావచ్చు. ఏదైనా సరే ప్రేమ అమూల్యమైనది. ఇప్పటి వరకు మనం ఒక అబ్బాయి, అమ్మాయికి తన ప్రేమని వ్యక్త పరచటం మాత్రమే చూశాం. కానీ ఇక్కడ మాత్రం అది రివర్స్ అయ్యిందనే చెప్పాలి. అమ్మాయే, అబ్బాయి ముందు చేతిలో గులాబీల బొకేతో ఒంటి కాలిపై కూర్చొని మరీ లవ్ ప్రపోజ్ చేయడం, అందుకు ఆ అబ్బాయి ఓకే చెప్పడం జరిగింది. అంతేకాక వారిద్దరూ యూనివర్సిటీ ఆవరణలోనే ఒకరి నొకరు కౌగిలించుకున్నారు. ఈ సంఘటన లాహోర్ లోని ఒక యూనివర్సిటీలో జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.
సదరు అమ్మాయి, అబ్బాయి చదువుతున్న యూనివర్సిటీ ఆవరణలోనే వారిద్దరూ ఇలా ప్రపోజ్ చేసుకోవడమనేది ఆ యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించి.. ఇలాంటి దుష్ప్రవర్తన పని చేసినందుకు గానూ ఆ యూనివర్సిటీ యాజమాన్యం మండి పడింది. అంతేకాదు వారికి యూనివర్సిటీని క్రమశిక్షణ సంఘం నోటీసులు కూడా పంపింది. అయితే యూనివర్సిటీని క్రమశిక్షణ సంఘం నుండి వారికి నోటిస్ వచ్చినా కూడా.. వారు లైట్ తీసుకుని హాజరు కాలేదు. దీంతో యూనివర్సిటీ వారు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇకపై వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదివే అవకాశం లేకుండా చేశారు.
మార్చి 12 న ఆ ప్రేమికులిద్దరూ.. క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాల్సి ఉండగా, వారు హాజరు కాలేదు. దీనితో సెక్షన్ 16 క్రింద వారిని డిబార్ చేసినట్లుగా ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్ లాహోర్ లో కానీ, దానికి సంబంధించిన సబ్ క్యాంపస్‌లలో కానీ వారు చదివేందుకు అవకాశం లేకుండా చేశారు. ఈ ప్రేమికులపై యూనివర్సిటీ తీసుకున్న సంచలన నిర్ణయం క్షణాల్లోనే నెట్ మాయాజాలంలో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలోని నెటిజన్లు ఆ యూనివర్సిటీని తిట్టి పోస్తున్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…