‘ఉప్పెన’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ | Uppena Movie Theatrical Trailer
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఆల్రెడీ సంగీత ప్రియులను అలరిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. విలేజ్ బాక్డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టొరీగా హై ఎమోషన్స్ తో రూపొందిన ‘ఉప్పెన’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ లో వస్తోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.
ఫిబ్రవరి 12న గ్రాండ్ రిలీజ్
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మాట్లాడుతూ.. దర్శకుడు బుచ్చిబాబు కథ చెప్పిన దానికంటే టు హండ్రెడ్ పర్సెంట్ బాగా తీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. మా సంస్థలో పనిచేస్తున్న డైరెక్టర్స్, వెల్ విషర్స్ అందరూ సినిమా చూసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు అని అప్రిషియేట్ చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా సినిమా చూసి చాలా గొప్ప సినిమా తీశారు అని ఆయన సంతోషాన్ని అంతా మాతో షేర్ చేసుకున్నారు. వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ మా మైత్రీ టీం అందరికీ చాలా థాంక్స్. ఇంత మంచి అద్భుతమైన సినిమాని మా బ్యానర్ లో చేసిన సుకుమార్ గారికి, బుచ్చిబాబులకు మా ధన్యవాదాలు. ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గా ఉప్పెన రిలీజ్ అవుతుంది. ప్రతీ ఒక్కరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము.. అన్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…