‘ఉప్పెన’కు విజయ్ దేవరకొండ సపోర్ట్ | vijay deverakonda supports to Uppena
లైగర్ విజయ్ దేవరకొండ ‘ఉప్పెన’కు సపోర్ట్ అనగానే.. ఆ చిత్రంలో ఏమైనా స్పెషల్ రోల్ చేస్తున్నాడా? అని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు కానీ.. ‘ఉప్పెన’కు విజయ్ దేవరకొండ మాత్రం సపోర్ట్ చేశారు. అదెలా అంటే.. లేటెస్ట్ సెన్సేషనల్ స్టార్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ ఈ చిత్రంలోని ‘జల జల జలపాతం నువ్వు..’ అంటూ సాగే పాటను ఆదివారం రిలీజ్ చేశారు.
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 12న థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలు సంగీత ప్రియులను అమితంగా అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి మరో పాటైన ‘జలపాతం’ పాటను ఆదివారం విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
‘జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెలయేరుని నేను’ అంటూ సాగే ఈ పాటను చిత్రంలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిపై డ్యూయెట్‌గా చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సుమధుర బాణీలకు తగ్గట్లు అందమైన పదాలతో పాటను అల్లారు గేయ రచయిత శ్రీమణి. జస్‌ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ గాత్రంలో ఈ మెలోడీ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనేట్లుగా ఉంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇప్పుడే పాట విన్నాను, లాంచ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్ గారు మరోసారి మ్యాజిక్ చేశారు. సాంగ్ అదిరిపోయింది. ఈ మూవీతో ముగ్గురు పరిచయమవుతున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబుగారు, హీరోయిన్ కృతి, హీరో వైష్ణవ్ తేజ్. ఈ ముగ్గురికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఈ సినిమా వారికి హ్యాపీనెస్‌ను, సక్సెస్‌ను తీసుకొస్తుందని ఆశిస్తున్నా. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ అంటున్నారు. అందరూ థియేటర్లలో ఈ సినిమా చూసి, ఎంజాయ్ చేయండి.. అన్నారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ మాట్లాడుతూ.. ఈ ఆల్బమ్‌లోనే మా అందరి ఫేవరేట్ సాంగ్ ఈ పాట. విజయ్ దేవరకొండగారు ఈ సాంగ్‌ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దేవిగారు ఈ సినిమాకు ఆల్‌టైమ్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. ఒక మంచి లవ్ స్టోరీకి ఆత్మ లాంటి సంగీతాన్నిచ్చారు.. అన్నారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా పాల్గొన్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…