‘వేట్టయన్- ద హంటర్’ ట్రైలర్ విడుదల Vettaiyan - The Hunter Trailer Released
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’.టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. దసరా సందర్భంగా అక్టోబర్ 10న వేట్టయన్ ద హంటర్‌ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘వేట్టయన్- ద హంటర్’ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇన్‌స్టంట్‌గా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది ట్రైలర్.
`ఖైదు చెయ్ ఖైదు చెయ్… నేరస్తుడిని ఖైదు చెయ్
ఖైదు చెయ్ ఖైదు చెయ్… నేరస్తుడిని ఖైదు చెయ్`
అంటూ మొదలవుతుంది వేట్టయన్ – ద హంటర్ ట్రైలర్.
వారంలో ఎన్‌కౌంటర్ జరిగిపోవాలి…
అని రావు రమేష్ అనే మాటకు…
అక్కర్లేదు సార్. వారం రోజులు అక్కర్లేదు. మూడే రోజుల్లో డిపార్ట్ మెంట్‌కి మంచి పేరొస్తుంది అంటూ సమాధానం చెబుతూ ఎంట్రీ ఇస్తారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆయన స్టైలిష్ నడక, హుందాతనం చూస్తే, వేట్టయన్ – ద హంటర్ అనే పేరుకు పర్ఫెక్ట్ గా సరిపోయిన కటౌట్ అనిపిస్తుంది.
జస్టిస్ డినైడ్ అంటూ… కారులో వెళ్తూ కనిపిస్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.
అందరూ కనిపిస్తున్నప్పుడు రానా కనిపించకపోతే ఎలా…
కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు అంటూ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చేస్తారు యాంగ్రీ యంగ్ మ్యాన్ రానా.
దొంగంటే ముసుగేసుకుని తిరగాలనే రూలేం లేదు. కొంచెం బుర్రుంటే చాలు.. అంటూ వైవిధ్యమైన కేరక్టర్‌తో పరిచయమయ్యారు ఫాహద్ ఫాజిల్.
`క్రైమ్ కేన్సర్ లాంటిది. దానికి పెరగనివ్వకూడదు.
సార్ తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది.
వాడి నెట్‌వర్క్ లో రెండు వేల మందికి పైగా ఉన్నారు.
ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్నీ ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఊరికే మాట్లాడి ప్రయోజనం లేదు.. వాడిని లేపేద్దాం. గాట్ ఇట్..
యస్ సార్.. `
2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో రాబోతున్న సినిమా వేట్టయన్ ద హంటర్. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాలకు పుట్ ట్యాపింగ్ ట్యూన్స్ అందించి మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్… రజనీకి నాలుగోసారి సంగీతం అందించిన సినిమా కావటంతో ‘వేట్టయన్- ద హంటర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన ‘వేట్టయన్- ద హంటర్’ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
నటీనటులు:
సూపర్‌స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులు
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…