"మిస్టర్ ఇడియట్" సినిమాలోని ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ Kanthara lyrical song from Mr Idiot unveiled by Young hero Nikhil Siddhartha
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియట్” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన “మిస్టర్ ఇడియట్” ట్రైలర్ డిజిటల్ వ్యూస్ లో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ రోజు “మిస్టర్ ఇడియట్” సినిమా నుంచి ‘కాంతార కాంతార..’ లిరికల్ సాంగ్ ను యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. పాట చాలా ఎనర్జిటిక్ గా ఉందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలియజేశారు.
అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేసిన ‘కాంతార కాంతార..’ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాటలోని ఎనర్జీని రెట్టింపు చేసేలా పాడారు. ‘ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే, మా లెక్కనే నీకు రెండు కాళ్లు చేతులు ముక్కు మూతి ఉన్నయి గాదె, బలుపు నీకు ట్విన్ బ్రదరా, ఈగో నెత్తి మీద ఫెదరా, మనషులంటే నీకు పడరా, నువ్వేమన్న అవతారా, ఎమి చూసుకుని నీకు ఇంత టెక్కూ, దిష్టి బొమ్మకైన పనికి రాదు నీ పిక్కూ ..కాంతార కాంతార కాంతారా…’ అంటూ సాగుతుందీ పాట. కాలేజ్ లో హీరోయిన్ ను హీరో టీజింగ్ చేసే సందర్భంలో ఈ పాటను రూపొందించారు.
నటీనటులు – మాధవ్, సిమ్రాన్ శర్మ, తదితరులు
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…
తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో…
ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా…