vijay devarakonda at yadadri temple
లైగర్ పరాజయంతో కాస్త నిరుత్సాహపడ్డ రౌడిబాయ్ విజయ్ దేవరకొండకు ఖుషి కాస్త ఊరట నిచ్చిందనే చెప్పాలి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖుషికి కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగానే వున్నాయి. విజయ్ కెరీర్‌లోనే హాయ్యెస్ట్ ఓపెనింగ్స్‌ను ఖుషి సాధించిదని చెబుతున్నారు మేకర్స్. ఇదిలా వుండగా టాలీవుడ్‌లో బిగ్‌స్టార్ మొదలుకొని మీడియం స్టార్ వరకు సినిమా విడుదల తరువాత సినిమా విజయం సాధించిందని తెలియజేయడానికి సినిమా టీమ్‌తో కలిసి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటారు.అక్కడ కాస్త మీడియాతో హడావుడి చేసి వస్తుంటారు. అది అనవాయితిగా వస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ ఈ విషయంలో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఖుషి సినిమా టీమ్‌తో కలిసి విజయ్ నేడు యాదగిరి గుట్టలోకి శ్రీలక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుని ఆశ్శిస్సులు అందుకున్నారు. విజయ్‌తో పాటుఆనంద్ దేవరకొండ, గోవర్థన్ దేవరకొండ, విజయ్ తల్లి మాధవి, దర్శకుడు శివనిర్వాణ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లు కూడా యాదగిరి గుట్టకు వెళ్లి ఆశ్శీస్సులు అందుకున్నారు. ఇక విజయ్ శ్రీకారం చుట్టిన ఈ సంప్రదాయాన్ని ఎంత మంది సెంటిమెంట్‌గా పాటిస్తారో చూడాలి. ఇటీవల యాదగిరి గుట్ట దేవాలయాన్ని వందలకోట్లు ఖర్చుపెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన సంగతి తెలిసిందే
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…