ysrcp-mp-mvv-satyanarayana comments
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోకాలం లాభాల్లో నడిచిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సమస్య ఉంటే పరిష్కరించాలి తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు. విశాఖలో ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. విశాఖ ఉక్కుకు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధం అందరికీ తెలుసన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల ఫ్యాక్టరీల్లో విశాఖ ఉక్కు ఒకటని గుర్తుచేశారు. కొన్నేళ్లు నష్టాలు వచ్చినా మళ్లీ కోలుకునే సామర్థ్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఉందన్నారు. స్వంత గనులు లేకనే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వస్తున్నాయని, విస్తరణకు రుణాలు తీసుకున్నందున వడ్డీభారం కూడా అధికంగా ఉందన్నారు.
రూ.22 వేల కోట్ల రుణభారాన్ని ఈక్విటీగా మార్చి సొంత గనులు ఇస్తే విశాఖ ఉక్కు లాభాలు సాధిస్తుందన్నారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానిని కలుస్తామని, ప్రధానికి ఆంధ్రుల సెంటిమెంట్‌ను వివరిస్తామన్నారు. కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనుకాడమన్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…