Categories: CinemaLatest

‘జాంబిరెడ్డి’ పెద్ద హిట్ అవ్వాలంటోన్న మెగా హీరో

తేజ సజ్జ.. బాల నటుడిగా అందరికీ పరిచయమే. ఇప్పుడతను హీరోగా చేస్తున్న చిత్రం ‘జాంబిరెడ్డి‘. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆనంది, దక్ష నగర్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం అత్యధిక ధియేటర్లలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ జాంబిరెడ్డి ఫ్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు తేజ. వాడు మా ఫ్యామిలో ఒక మెంబర్‌లాంటి వాడు. పెద్దనాన్నగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. తేజ సడెన్‌గా ‘ఓ బేబీ’లో కనిపించాడు. అందులో క్యూట్‌గా, హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. సినిమా చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ టైమ్ తేజ జాంబీస్ జోనర్ మూవీని సెలెక్ట్ చేసుకొని చేసినందుకు అభినందిస్తున్నాను. హాలీవుడ్‌లో జాంబీస్ వెరీ సక్సెస్ ఫుల్ జోనర్. హిందీలో ఒకటి, తమిళంలో ఒక మూవీ వచ్చాయి. అవి మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబిరెడ్డి వస్తుంది. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ వర్మ వెరీ టాలెంటెడ్, గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. డిఫరెంట్ జోనర్స్ లో కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న ‘జాంబిరెడ్డి’ తేజకు పెద్ద హిట్ కావాలి. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాత రాజ్ శేఖర్ వర్మగారు నన్ను నమ్మి ఈ సినిమా చేశారు. అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువైనా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్‌గా జాంబిరెడ్డి చిత్రాన్ని రూపొందించారు. షూటింగ్ పాండమిక్ టైంలో జరిగింది. ఆయన ఎంతో మందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. అలాంటి మంచి వ్యక్తి నాకు నిర్మాతగా దొరకడం నా అదృష్టం. అనిత్ పెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చాడు. మ్యూజిక్ రాబిన్, ఎడిటర్ సాయి, కాస్ట్యూమ్స్ ప్రశాంతి టీమ్ అంత చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. ముఖ్యంగా మా సిస్టర్ స్నేహ నేను గుడ్ సినిమా తీస్తే.. తను గ్రేట్ సినిమాలా చేసింది. తేజ నాకు మంచి ఫ్రెండ్. అ! సినిమా కన్నా ముందే తనతో సినిమా చేయాలి.. కుదరలేదు. జాంబిరెడ్డిలో ఫుల్ ఎనర్జిటిక్‌గా చేశాడు. ఆనంది, దక్ష పెంటాస్టిక్‌గా నటించారు. కొత్త జోనర్‌లో వస్తున్న జాంబిరెడ్డి సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా యూనిట్ అంతా బ్లాక్ బస్టర్ సినిమా చేశాం అని చెప్తున్నారు. ముందునుండి ఈసారి గట్టిగా కొట్టాలి అని కసితో ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూశాం అని.. కొత్త అనుభూతికి లోనవుతారు..’’ అన్నారు.

హీరో తేజ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి టాప్ టు ఎండ్ వరకు అన్నీ ప్రశాంత్ వర్మనే.. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. హీరోగా నా ఎదుగుదలకు చేయి పట్టి నడిపిస్తున్న మా నిర్మాత శేఖర్ వర్మగారికి నా కృతజ్ఞతలు. ఆయనకోసం నేను ఎప్పుడూ ముందుంటాను. ఫిబ్రవరి 5న మా సినిమా విడుదలవుతుంది.. రెండున్నర గంటలు ప్రతి ఒక్కర్నీ నవ్విస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఎ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. చిరంజీవి గారిని త్వరలో కలవనున్నాం. ఆయన బెస్ట్ విషెస్ అందించారు. నన్ను సపోర్టు చేస్తున్న వరుణ్ తేజ్ అన్నకు చాలా థాంక్స్. మా టీమ్‌ను బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

ఇంకా హాజరైన అతిథులందరూ కొత్త జోనర్లో వస్తున్న జాంబిరెడ్డి చిత్రం డెఫినెట్‌గా మంచి హిట్ అవుతుందని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Recent Posts

ఇంద్రకీలాద్రిపై ‘దేవీం స్మరామి’.. భాగ్యనగరంలో ‘దుర్గే ప్రసీద’తో ఆకట్టుకున్న పురాణపండ

తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…

October 11, 2024 at 1:09 PM

దేవీచౌక్ అమ్మవారి ఉత్సవాల్లో మెరిసిన పురాణపండ ‘సౌభాగ్య’

కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…

October 6, 2024 at 8:21 PM

‘మార్టిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముఖ్యాంశాలు

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌,…

October 5, 2024 at 12:58 PM

రికార్డులు బద్ధలు కొడుతున్న ‘డీమాంటే కాలనీ 2’

నేషనల్‌, అక్టోబర్‌xx, 2024: స్ట్రీమింగ్ వరల్డ్ ని దున్నేస్తోంది డీమాంటే కాలనీ2. 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్ తో…

October 5, 2024 at 12:29 PM

గోపీచంద్ ‘విశ్వం’ థర్డ్ సింగిల్ వస్తాను వస్తానులే సాంగ్ రిలీజ్

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. రీసెంట్…

October 5, 2024 at 12:19 PM

ఆలియాభట్‌ “ఆల్ఫా” వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ 'ఆల్ఫా'. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.…

October 5, 2024 at 12:11 PM