ఆకట్టుకుంటోన్న ‘మైదాన్’ ట్రైలర్ Ajay Devaghan Maidaan Trailer Released
బయటి ప్రపంచానికి అంతగా తెలియని మన రియల్ హీరో సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్రను చూపించేందుకు ‘మైదాన్’ అనే సినిమా రాబోతోంది. అజయ్ దేవగన్ పోషించిన ఈ పాత్రతో కోచ్‌గా భారతదేశం కోసం ఆయన చేసిన కృషి, చరిత్రలో ఎలాంటి రికార్డులను సృష్టించాడు? అనే కథాంశంతో మైదాన్ రాబోతోంది. ప్రపంచంలో అత్యధికంగా ఆడే క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మన దేశం విజయాన్ని ఎలా సాధించేలా చేశారో చూపించబోతోన్నారు.
యథార్థ ఘటనల ఆధారంగా ఈ ‘మైదాన్’ సినిమాను ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీందర్నాథ్ శర్మ తెరకెక్కించారు. మైదాన్ చిత్రంలో.. ప్రియమణి, గజరాజ్ రావు, ప్రసిద్ధ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ కూడా నటించారు. మైదాన్ ట్రైలర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణాన్ని తెరపై అంతే అద్భుతంగా చూపించారు.
సయ్యద్ అబ్దుల్ రహీమ్ అద్భుతమైన ప్రయాణం, ఫుట్ బాల్ ఆటను IMAXలో కూడా చూడొచ్చు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను సాయివిన్ క్వాడ్రాస్, రితేష్ షా అందించారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్, సాహిత్యాన్ని మనోజ్ ముంతాషిర్ శుక్లా అందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రంజాన్‌కు థియేటర్లలో విడుదల చేయనున్నారు.
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…