కాశ్మీర్లో.. ఉషాపరిణయం Usha Parinayam Movie Song Shoot in Kashmir
తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపైకె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్‌భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తుండగా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చతెలుగమ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను హీరో , హీరోయిన్‌పై దుబాయ్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కాశ్మీర్‌కు పయనమైంది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ… ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణతో టాకీపార్ట్ పూర్తయింది. ఇటీవల దుబాయ్‌లో ఓ పాటను చిత్రీకరించాం. ప్రస్తుతం మరో రెండు పాటల చిత్రీకరణ కోసం కాశ్మీర్ వెళుతున్నాం. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.
శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ, దర్శకత్వం-నిర్మాత :కె.విజయ్‌భాస్కర్
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…