April 28 em Jarigindi Movie review and rating
నటీనటులు: డా.రంజిత్, షెర్రీ అగర్వాల్, తనికెళ్లభరణి, అజయ్, చమ్మక్‌చంద్ర తదితరులు
బ్యానర్: వీజీ ఎంటర్‌టైన్‌మెంట్స్,
దర్శకత్వం: వీరాస్వామి,
సంగీతం: సందీప్‌కుమార్,
విడుదల తేదీ: ఫిబ్రవరి 27, 2021
యువ నటుడు నిఖిల్, బిగ్‌బాస్ ఫేం సోహైల్ ఏప్రిల్ 28 ఏం జరిగింది చిత్రం చూసి ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందని చెప్పడంతో పాటు చిత్రం ట్రైలర్, ప్రచారచిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. అయితే నిఖిల్, సోహైల్ చెప్పినట్లుగానే ఈ సినిమా ఆసక్తికరంగా వుందా.. లేదా తెలియాలంటే సమీక్ష పూర్తిగా చదవాల్సిందే.
కథ: సినిమాలకు కథలు అందిస్తుంటాడు రచయిత విహారి (హీరో రంజింత్), తను రెగ్యులర్‌గా కథలు అందించే నిర్మాతకు (తనికెళ్ల భరణి) ఓ క్రేజీ దర్శకుడు (రాజీవ్ కనకాల) సినిమా చేస్తానని డేట్స్ ఇవ్వడంతో.. ఆ కథ అన్వేషణ కోసం, నూతన ఆలోచనల కోసం భార్య (షెర్రీ అగర్వాల్), పిల్లలతో కలిసి విహార యాత్రకు బయలుదేరతాడు విహారి. కారు రిపేరు కావడంతో పోలీస్‌ఆఫీసర్ (అజయ్) సహాయంతో అనుకోకుండా ఓ అతిథిగృహంలో బస చేయాల్సి వస్తుంది. అప్పుడు విహారికి అక్కడ ఎదురైన పరిణామాలేంటి? దర్శకుడు మెచ్చిన కథ తయారు చేశాడా అనే ఆసక్తికరమైన కథనంతో మిగత కథ కొనసాగుతుంది.
ఆర్టిస్టుల పనితీరు: హీరో రంజిత్‌కు మొదటి చిత్రమైనా చాలా సహజంగా నటించాడు. విహారి పాత్రలో ఒదిగిపోయాడు, తప్పకుండా నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తనికెళ్ల భరణి, అజయ్‌ల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చమ్మక్ చంద్ర కామెడీ కాస్త వినోదం పంచింది. మిగతా నటీనటులందరూ వారి పాత్రల పరిధిమేర నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే.. సందీప్‌కుమార్ నేపథ్య సంగీతం, అలాగే సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం ట్రిమ్ చేయవచ్చు అనిపించింది. సినిమా నిర్మాణపరంగా చాలా రిచ్‌గా ఉంది. దర్శకుడు వీరాస్వామి తను చెప్పాలనుకున్న కథని చక్కగా తెరకెక్కించాడు. గ్రాఫ్ పడిపోకుండా.. అన్ని అంశాలను మేళవిస్తూ.. ఆడియన్స్ బోర్ ఫీలవ్వకుండా చేశాడు.
విశ్లేషణ: ఓ సరికొత్త పాయింట్‌తో దర్శకుడు వీరాస్వామి చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌లు, పతాక సన్నివేశాలు ప్రేక్షకులకు షాకింగ్‌గా వుంటాయి. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కథలో ఇన్‌వాల్వ్ చేసే విధంగా వుంది. రెగ్యులర్ చిత్రాలు చూసి విసిగి పోయిన వారికి ఈ చిత్రం మంచి రిలీఫ్ ఇస్తుంది. ప్రేక్షకులను రెండు గంటలు థ్రిల్ చేసే పర్‌ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా చెప్పుకోవచ్చు. ఎటువంటి ద్వంద్వర్థాలు, అశ్లీల సన్నివేశాలు లేని సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. తప్పకుండా చిత్రాన్ని అందరూ చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: ఆసక్తికరమైన సస్పెన్స్ థ్రిల్లర్
రేటింగ్: 3.25/5
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య…
కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్ చేయగలిగితే…
పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…
నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…
సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ…