ఆఫీసులో సెలవులు కావాలంటే చాలా మంది ఉద్యోగులు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం పరిపాటే. ఇలాంటివి చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. చిన్నప్పుడు స్కూలు సెలవు కోసం కడుపు నొప్పంటూ అబద్ధం చెప్పడంతో ఇది మనకు అలవాటైపోతుంది. కానీ జీవితంలో ఎదిగిన తర్వాత ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకునో మారతాం. కానీ కొందరు మాత్రం మారరు. అంతేకాదు వయసుతో పాటు తమ అబద్ధాల స్థాయి కూడా పెంచుతూ పోతుంటారు. ఇలాంటి కథే అమెరికాలోని అరిజోనాలో వెలుగు చూసింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న 19 ఏళ్ల ఎంప్లాయీకి సెలవు కావాల్సి వచ్చింది. ఆఫీసులో ఏదో ఒకటి చెప్పి లీవ్ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ లీవ్ దొరకడం కష్టమని అర్థం అయింది. అంతే భయంకరమైన ప్లాన్ వేసి.. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు.
అర్థం కాలేదా? అయితే మొత్తం చదవాల్సిందే.. అరిజోనాలోని వాటర్ టవర్ సమీపంలోని ఒక టైర్ ఫ్యాక్టరీలో పనిచేసే బ్రాండన్ సోల్స్ అనే యువకుడు తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీకి కొద్ది దూరంలో సోల్స్ బందీగా పడివుండటాన్ని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూశాడు.
ఆ సమయంలో సోల్స్ చేతులు బెల్ట్‌తో కట్టేసివున్నాయి. అరవకుండా ఉండేందుకు అతని నోటిలో ఏవో కుక్కేసి కనిపించాయి. ఇవన్నీ చూస్తే సోల్స్‌ను ఎవరో కిడ్నాప్ చేశారనే అనిపిస్తుంది. అతన్ని అలా చూసిన వ్యక్తి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోల్స్‌ను విడిపించారు. పోలీసుల విచారణలో సోల్స్ తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలిపాడు. తనను ఓ కారులో ఎక్కడికో తీసుకువెళ్లి, తిరిగి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారని తెలిపాడు. తన తండ్రి నగరంలో ఎక్కడో డబ్బులు దాచాడని, వాటికోసమే తనను కిడ్నాప్ చేశారని చెప్పాడు. అయితే సోల్స్ పనిచేస్తున్న కంపెనీకి చెందిన అధికారులు విచారించగా అతను చెబుతున్నది అబద్ధమని తేలింది. దీంతో వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కొంచెం బలంగా విచారించగా.. కంపెనీలో సెలవు కోసమే కిడ్నాప్ డ్రామా ఆడానని సోల్స్ ఒప్పేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన కంపెనీ.. అతన్ని ఉద్యోగంలో నుంచి తొలగించింది.
అరమరికలొద్దు. అపోహలొద్దు. అనుమానాలొద్దు. అసూయలొద్దు. అహంకారాలొద్దు. బ్రాహ్మణుడు క్షేమంకరమైన భావాలతో సంచరిస్తేనే అపూర్వాలు సమాజానికి అందుతాయంటూ చాలా చక్కగా ప్రముఖ…
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్…
క్రమపాఠీలు, ఘనపాఠీలు, సలక్షణ ఘనపాఠీలు... ఇలా ఎందరో వేదనిధుల్లాంటి వందకు పైగా వివిధ ఆలయాల, వివిధ వేద పాఠశాలల వేదపండితులు…
తెలుగు రాష్ట్రాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధానంలో, వరంగల్ భద్రకాళీ దేవి పాదాలచెంత, హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ…
కాకినాడ, అక్టోబర్ 6: పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్…