Sports

మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన బ్యాట్స్‌మెన్.. డాక్టరు వచ్చేసరికే..

రసవత్తరంగా సాగుతున్న ఆ క్రికెట్ మ్యాచ్.. ఉన్నట్లుండి విషాదాంతం అయింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారా? అని అందరూ ఉత్కంఠగా చూడాల్సింది పోయి.. అందరి హృదయాల్లోనూ ఓ అగాధాన్ని మిగిల్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో నాన్ స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలబడి ఉన్న బ్యాట్స్‌మెన్ సడెన్‌గా కుప్పకూలి పోయాడు. ఏమైందని ఆందోళన చెందిన మిగతా ఆటగాళ్లకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. క్రీడాభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన పూణేలో జరిగింది. ఇక్కడి జున్నార్ మండలంలో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఇక్కడ మ్యాచ్ జరుగుతుండగా అలా కింద కూర్చున్న బ్యాట్స్‌మెన్.. ఉన్నట్లుండి వెనక్కు పడిపోయాడు. అంపైర్ చూసి ఆందోళనగా డాక్టర్లను పిలిచాడు. కానీ సదరు బ్యాట్స్‌మెన్ అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. అతని పేరు బాబూ నలవాడే అని తెలుస్తోంది.

ఈ సమయంలోనే బౌలర్ బంతి వేయగా బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మన్ భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అదే సమయంలో నాన్ స్ట్రైకర్ వైపు ఉన్న నలవాడే పరుగు తీయడానికి ముందుకు వచ్చాడు. కానీ బ్యాట్స్‌మెన్ విఫలం అవ్వడాన్ని చూసి వెనుదిరిగాడు. కీపర్ నుంచి బంతి అందుకున్న బౌలర్.. బంతి వేయడానికి మళ్లీ తన పొజిషన్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో అంపైర్‌తో ఏదో మాట్లాడిన నలవాడే.. వెళ్లి మళ్లీ తన స్థానంలో నిలబడ్డాడు. అంతలోనే ఏదో ఇబ్బంది ఉన్నట్లు బ్యాట్ పట్టుకొని మోకాళ్లపై కూర్చున్నాడు. క్షణం కూడా గడవక ముందే సడెన్‌గా వెనక్కి పడిపోయాడు. అతడిని అలా చూసి ఆందోళన చెందిన అంపైర్.. వెంటనే స్పందించి మెడికల్ సిబ్బందికి సమాచారం అందజేశాడు. మెడికల్ టీమ్ వెంటనే అక్కడకు వచ్చి నలవాడేను పరీక్షించింది. కానీ ఫలితం లేకపోయింది. అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Recent Posts

పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

హైదరాబాద్, ఏప్రిల్ 14: జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

April 14, 2025 at 8:10 PM

‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న న‌టుడు శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య…

April 8, 2025 at 2:40 PM

‘తత్వం’ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే…

April 8, 2025 at 2:25 PM

శ్రీరామచంద్రుని ‘జయ జయ రామ’ ఆవిష్కరించిన నాగబాబు.. పవన్ కళ్యాణ్, బొల్లినేని, పురాణపండకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన శ్రేణులు

పిఠాపురం, ఏప్రిల్ 6: శ్రీరామచంద్రుడన్నా, ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

April 6, 2025 at 3:05 PM

‘పెద్ది’.. ‘ఫస్ట్ షాట్’ అదిరిందిగా!

‘‘ఓటే పని సేసేనాకి.. ఒకేనాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేలమీన ఉన్నప్పుడే సేసేయాలా.. పుడతామా ఏటి…

April 6, 2025 at 1:48 PM

ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న’అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి'. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక…

April 4, 2025 at 8:36 PM
AddThis Website Tools