Cinema

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల చిత్రం ‘కుబేర’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #DNS ను భారతీయ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్- నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేనితో రూపొందిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

మహా శివరాత్రి శుభ సందర్భంగా, మేకర్స్ సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అత్యంత సంపన్నుడైన దేవుడు పేరు ‘కుబేర’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టారు. అయితే ధనుష్ లుక్ టైటిల్‌కి భిన్నంగా ఉంది. బ్యాక్ డ్రాప్ శివుడు అన్నపూర్ణ దేవి నుంచి భిక్ష తీసుకుంటున్నట్లు చూపిస్తుంది,  ధనుష్ ఇమేజ్ ముందు నిలబడి, మెస్సి అవతారంలో, చిరిగిన బట్టలతో కనిపిస్తున్నారు.

టైటిల్‌కు భిన్నంగా ధనుష్ పాత్రను ప్రజెంట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో శేఖర్ కమ్ముల ఆసక్తిని కలిగించారు. దీంతో సినిమా ధనుష్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో అనే క్యురియాసిటీ పెరిగింది. నాగార్జున పాత్ర గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన అప్‌డేట్ కోసం మరికొంత కాలం ఆగాల్సిందే.

ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నర్,  రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం లార్జ్ కాన్వాస్‌పై లావిష్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది.

తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు,…

September 12, 2026 at 9:37 PM

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM