Cinema

‘NBK 109’ గ్లింప్స్.. కల్ట్ సరుకు అదిరింది

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథానాయకులలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన సినిమాలు మాస్, స్టైలిష్, యాక్షన్ సన్నివేశాల కలబోతతో సంపూర్ణ వినోదాన్ని పంచేలా ఉంటాయి. అద్భుతమైన మాస్ డైలాగ్ డెలివరీ మరియు రాయల్ లుక్స్ కారణంగా అభిమానులు ఆయనను ‘నటసింహ’ అని ప్రేమగా పిలుస్తారు. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు.

రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా చూపిస్తుంటారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మలిచే తీరు మెప్పిస్తుంది. ఇప్పుడు బాలకృష్ణతో ఆయన కలిసి పని చేస్తుండటం.. సినీ ప్రియుల్లో మరియు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. వీరి కాంబినేషన్ లో కూల్ మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ రావడం ఖాయమనే అంచనాలు అందరిలో నెలకొన్నాయి.

మార్చి 8న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘NBK109′(వర్కింగ్ టైటిల్) నుండి చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేసింది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ కారణంగా ఇప్పటికే ఏర్పడిన భారీ అంచనాలను.. ఈ గ్లింప్స్ మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌ తో రూపొందించిన గ్లింప్స్ లో నందమూరి బాలకృష్ణ(NBK)ను దర్శకుడు బాబీ “నేచురల్ బోర్న్ కింగ్”గా చూపించారు. కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు బాలయ్య.

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూలెస్ట్ మరియు క్రూయలెస్ట్ గా కనిపిస్తారని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ దానికి రుజువులా ఉంది. బాలకృష్ణ తన టూల్ బాక్స్‌లో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ ఆల్కహాల్ బాటిల్‌ ని తీసుకెళ్లడం మనం చూడవచ్చు. గూండాలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్ గా ఆల్కహాల్ తాగడం ఆకట్టుకుంది. “ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా?” అని ప్రత్యర్థి గ్యాంగ్ లోని వ్యక్తి అడగగా.. “సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ వేట మొదలుపెట్టడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఈ గ్లింప్స్ ను “కల్ట్ సరుకు” అని పిలవడం మునుపెన్నడూ లేని విధంగా భారీ కిక్ ఇస్తోంది.

మొత్తానికి ‘NBK109’ గ్లింప్స్ అభిమానులను, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతో బాలకృష్ణ-బాబీ డియోల్ మధ్య అదిరిపోయే సన్నివేశాలను మనం ఆశించవచ్చు. సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Share
Published by
Shankar

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM