Cinema

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు వైజాగ్‌లో గ్రాండ్ వెల్‌కమ్‌

పుష్ప చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట విశ్వ‌రూపంకు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ఈ చిత్రంతో ఆయ‌న‌కు ల‌భించిన పాపులారిటీతో  ప్ర‌పంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తార‌స‌ప‌డ‌తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్క‌డికి వెళ్లిన ఆయ‌న‌కు అభిమానుల చేత గ్రాండ్ వెల‌క‌మ్ ల‌భిస్తుంది. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏక‌ధాటిగా జ‌రుగుతుంది.

బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మాత‌లు. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభ‌మైంది. అత్యంత కీల‌కంగా భావించే ఈ షెడ్యూల్‌లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్‌స్టార్‌కు అల్లుఅర్జున్‌కు అక్కడి అభిమానులు, గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి అభిమానులు బైక్  ర్యాలిగా బ‌య‌లుదేరి త‌మ అభిమాన హీరో క‌నివినీ ఎరుగ‌ని వెల్‌క‌మ్ చెప్పారు. దారి పొడ‌వున పూల‌వ‌ర్షం కురిపించారు. అభిమానులు ఆప్యాయత‌ను చూసి ఐకాన్‌స్టార్ ఫిదా అయిపోయారు.

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM