Cinema

సంక్రాంతి కానుకగా ఆకాష్ – భైరవి అర్థ్యా జంటగా ‘కొత్త మలుపు’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ప్రత్యేక కానుకగా ‘కొత్త మలుపు’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి అర్థ్యా (Bhairavi Ardhya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాటల్లో.. “రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరింది. వీరు బావ–మరదలుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతాం.” అని చెప్పారు.

నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్నాం. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం.” అని అన్నారు.

గ్రామీణ నేపథ్యంతో, ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న ‘కొత్త మలుపు’ ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిత్ర వివరాలు:
నటీనటులు: ఆకాష్ (హీరో), భైరవి అర్థ్యా (హీరోయిన్), రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డీడీ శ్రీనివాస్, కిట్టయ్య తదితరులు
బ్యానర్: తధాస్తు క్రియేషన్స్
దర్శకత్వం: శివ వరప్రసాద్ కేశనకుర్తి
నిర్మాత: తాటి బాలకృష్ణ
సహ నిర్మాత: తాటి భాస్కర్
సంగీతం: యశ్వంత్
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

June 20, 2026 at 7:04 PM

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM