Cinema

Niddhi Agerwal: ప్రభాస్ లాంటి స్టార్ తో వర్క్ చేయడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ – హీరోయిన్ నిధి అగర్వాల్

Niddhi Aggarwal: టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్. అన్ కాంప్రమైజ్డ్ గా గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు హీరోయిన్ నిధి అగర్వాల్.

“రాజా సాబ్” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా కోసం మేమంతా 3 ఏళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇచ్చారని భావిస్తున్నాం. సినిమాకు మొదట్లో కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చినా ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. నేను బెస్సీ అనే రోల్ చేశాను. ఈ నన్ రోల్ లో డివైన్ గా కనిపించాలి. ఈ పాత్ర కోసం చాలా ప్రిపరేషన్స్ చేశాం. ముఖ్యంగా డ్రెస్ ఎలా ఉండాలనే విషయంలో డిస్కషన్స్ బాగా జరిగాయి.

“రాజా సాబ్” ముందు సినిమా హరి హర వీరమల్లులో నేను రాకుమారి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఏంజెల్ గా కనిపించాను. ఈ రోల్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ వరకు కాకుండా మొత్తం కథ విన్నాను. కథ విన్నప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా దర్శకుడు మారుతి గారు చూపించారు. ఆ పాయింట్ యూనిక్ గా అనిపించింది.

సప్తగిరి, ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్.. ఇలా చాలామంది కమెడియన్స్ తో కలిసి సీన్స్ చేశాం. సెట్స్ లో చాలా ఫన్ గా ఉండేది. నేను హరి హర వీరమల్లుతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర కూడా ఉండకపోయేది. ఆ టైమ్ లో రాజా సాబ్ మేకర్స్ బాగా సపోర్ట్ చేశారు. నన్ను సెట్ లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు నిధి అగర్వాల్ అంటే సెట్ లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు.

ప్రభాస్ గారితో వర్క్ చేయడం ప్లెజర్ గా ఫీలయ్యా. ఆయన తానొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనేది ఎప్పుడూ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. ఆయనలోని మంచితనం వినయం చూశాక మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతందనే విషయాన్ని మరింతగా నమ్మాను. హాస్పిటల్ సీన్ లో ఆయన అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. ఆయనతో సెట్ లో సినిమాలు, లైఫ్…ఇలా అనేక విషయాల్లో చాలా సరదా సంభాషణలు జరిగేవి.

డైరెక్టర్ మారుతి గారు ఎంతో క్లారిటీగా ఈ సినిమాను రూపొందించారు. ఆయన సెట్ కు వచ్చేప్పుడే ఏ సీన్ షూట్ చేయాలనేది క్లియర్ గా ఉండేవారు. ఒకేసారి ఐదారుగురు ఆర్టిస్టులతో సీన్ చేయించడం సులువు కాదు. ప్రతి ఒక్కరి టైమ్ కు వ్యాల్యూ ఇవ్వాలి. మారుతి గారితో వర్క్ చేయడం మా అందరికీ ఎంతో ఈజీ. ఆయన సెట్ లో సరదాగా ఉండేవారు.

భారీ బడ్జెట్ తో “రాజా సాబ్” సినిమాను నిర్మించడం అంటే ఎంతో ప్యాషన్ ఉండాలి. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడా విశ్వప్రసాద్ గారు రాజీ పడలేదు. అందుకే ఇంత హై క్వాలిటీతో సినిమా మన ముందుకు వచ్చింది. ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ అనే విషయం ముందే తెలుసు. ప్రభాస్ గారితో నటించడం, ఇంత భారీ చిత్రంలో నేనూ ఒక భాగం కావడం హ్యాపీగా ఉంది. విజువల్ ఎఫెక్టులు ఉన్న సీన్ లో యాక్టింగ్ కరెక్ట్ గా చేసేందుకు కొంత టైమ్ పట్టేది. లుక్ ఎక్కడ ఇవ్వాలి, లేనివి ఉన్నట్లు ఊహించుకుని రియాక్ట్ కావాలి..ఇలాంటివి కొన్ని సీన్స్ చేశాక ఈజీ అయ్యాయి.

హారర్ మూవీస్ చేస్తున్నప్పుడు ఆ మూవీలోని యాక్టర్స్ తమకు కొన్ని అనూహ్యమైన ఘటనలు జరగడం చూశామని చెబుతుంటారు. కానీ మాకు అలాంటివేం ఎదురుకాలేదు. నిజానికి నాకు దెయ్యాలు, ఇలాంటి హారర్ కంటెంట్ అంటే భయం. రాత్రి నిద్రపోయేప్పుడు లైట్స్ వేసుకుని హనుమాన్ చాలీసా లూప్ లో వింటూ నిద్రపోతా.

టాలీవుడ్ లో నేను భాగం. నాది తెలుగు సినిమా అని చెప్పుకుంటాను. ఇటీవల ముంబై వెళ్లినప్పుడు అక్కడ తెలుగు సినిమాలు ఎంత క్వాలిటీగా ఎంత పెద్ద స్కేల్ లో జరుగుతున్నాయో నార్త్ వాళ్లు చెబుతుంటే విన్నాను. మా మూవీనే కాదు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని నేను కోరుకున్నాను. మనమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం.

పవన్ కల్యాణ్ గారితో హరి హర వీరమల్లులో నటించినప్పుడు ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. చాలా ధైర్యంగా ఉంటారు. ప్రభాస్ గారితో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా.

ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. హిందీలో రెండు మూవీస్ చేస్తున్నా. తెలుగులో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నా. ఇక్కడికి షిప్ట్ అవుతున్నా. నా బాల్యం నుంచే హీరోయిన్ కావాలని కలగన్నా. నేను కలగన్న కెరీర్ నే కొనసాగిస్తున్నా కాబట్టి కొత్తగా నేను కోరేది ఏమీ లేదు. హీరోయిన్ గా మంచి పర్పస్ ఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలని ఆశిస్తున్నా.

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM