Categories: CinemaLatestTopStory

లావణ్య త్రిపాఠి కొణిదెల ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా బుధవారం నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో..

లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ… ‘‘సతీ లీలావతి’ని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అందరూ గొప్ప ఆర్టిస్టులు నటించారు. దేవ్ మోహన్ గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని మార్చి 6న చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ .. ‘కమల్ హాసన్ గారు చేసిన ‘సతీ లీలావతి’తో మాత్రం నా సినిమాని పోల్చను. అందరూ రిలీట్ అయ్యేలా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశాం. మార్చి 6న మా మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ .. ‘నిర్మాతగా నాకు ‘సతీ లీలావతి’ మొదటి చిత్రం. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. మార్చి 6న మా మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రానికి మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు సప్తగిరి మాట్లాడుతూ .. ‘పాత ‘సతీ లీలావతి’ ఎంత పెద్ద హిట్ అయిందో మా ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతకు ఇదే మొదటి చిత్రం. సత్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. మార్చి 6న ఈ మూవీని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

తారాగణం: లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు

సిబ్బంది:
సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
బ్యానర్: దుర్గాదేవి పిక్చర్స్
నిర్మాత: నాగ మోహన్
దర్శకుడు: తాతినేని సత్య
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్
డైలాగ్స్ : ఉదయ్ పొట్టిపాడు
ఆర్ట్ : కొసనం విఠల్
ఎడిటర్ : సతీష్ సూర్య
పీఆర్వో : మోహన్ తుమ్మల

Share
Published by
admin

Recent Posts

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM

యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్‌ వెల్‌ హెచ్‌ ఆర్‌

హైదరాబాద్, ఫిబ్రవరి 2026: హైదరాబాద్‌ అడ్వాన్స్‌ ఇండియా ఇనీషియేటివ్‌ ప్రారంభం. కింగ్స్‌ వెల్‌, స్వ్యాసిస్‌ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్‌ ఆర్‌…

February 25, 2026 at 12:35 PM

తిరుమల శ్రీవారి సేవకు కృష్ణయ్య, పురాణపండ లకు ఎన్ని జన్మల పుణ్యమిది

దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ ఆవిష్కృతమవుతున్న తీరు…

February 19, 2026 at 6:01 PM