Cinema

ఒక బృందావనం చిత్రం నుంచి లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల

ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా అరుదుగా ఉంటున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ బ్యూటిఫుల్‌ అండ్‌ హార్ట్‌టచ్చింగ్‌ సాంగ్‌ ఒకటి ‘ఒక బృందావనం’ నుంచి విడుదలైంది.   పసి పసి తనమే…ఎలా.. పరుగులు తీసే ఏరులా అని కొనసాగే ఈ పాటకు ప్రముఖ గీత రచయిత ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ చందబ్రోస్‌ సాహిత్యాన్ని అందించారు. చిన్మయ శ్రీపాద ఆలపించిన ఈ పాటకు సన్ని అండ్‌ సాకేత్‌ స్వరాలను అందించారు. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంలో నటించారు! బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. తాజాగా విడుదల చేసిన ఈ పాట అందరి హృదయాలకు  హత్తుకుంటుంది. ఎంతో హాయిగా కొనసాగే ఈ పాట థియేటర్‌లో ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతినిస్తుంది. ఈ చిత్రంలో వినోదంతో  పాటు మంచి అర్థవంతమైన సందేశాన్ని కూడా ఈ చిత్రంలో జోడించాం. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న మా చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనేట్రైలర్‌ను తీసుకవస్తాం. తప్పకుండా కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి, ఎడిటర్లు తమ్మిరాజు మరియు సంతోష్ కామిరెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను మెరుగుపరిచారు మరియు సంగీత దర్శకులు సన్నీ మరియు సాకేత్ ఆహ్లాదకరమైన సౌండ్‌ట్రాక్‌ను అందించారు. చంద్రబోస్, రామజోగై శాస్త్రి, శ్యామ్ కాసర్ల, శ్రీనివాస మౌళి మరియు కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యంతో, ఈ పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి

Recent Posts

Puranapanda Srinivas: ఒకే రోజు 3 మహా క్షేత్రాలను దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్

Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…

April 29, 2026 at 11:10 AM

వేల గొంతుకల హనుమాన్ చాలీసా పారాయణలో పురాణపండ పిలుపు

హైదరాబాద్: వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ…

April 24, 2026 at 5:13 PM

“హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్.. కొంపల్లిలో ఘనంగా రెండవ బ్రాంచ్

దేశంలో బిగ్గెస్ట్ లగ్జరీ బ్యూటీ క్లినిక్ గా ప్రసిద్ధిగాంచిన "హివాగ" కొత్త బ్రాంచ్ ఈరోజు కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. మూడేళ్ల…

March 21, 2026 at 8:11 PM

వైఎస్ఎస్ సేవలకు చిరంజీవి ప్రశంసలు

వైఎస్ఎస్ సేవలు భేష్: చిరంజీవి హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ సేవలను ప్రముఖ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి ప్రశంసించారు.…

March 19, 2026 at 8:53 PM

కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

-బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు -ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల…

March 6, 2026 at 8:34 PM

హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ…

February 27, 2026 at 5:16 PM